English | Telugu
Bigg Boss 9 Telugu: అయిదో వారం కెప్టెన్ గా పవన్ కళ్యాణ్.. బిగ్ ట్విస్ట్ అదే!
Updated : Oct 11, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో అయిదో వారం వీకెండ్ వచ్చేసింది. నిన్నటి వరకు టాస్క్ ల మీద టాస్క్ లతో కంటెస్టెంట్స్ బిజీగా ఉన్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారని బిగ్ బాస్ బాంబ్ పేల్చడంతో హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ లో టెన్షన్ మొదలైంది. అందుకే వారిని డేంజర్ జోన్ లో ఉంచి టాస్క్ లు పెట్టి అందులో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న టీమ్ ని సేఫ్ జోన్ లోకి పంపించాడు. ఇలా గత మూడు రోజుల నుండి ఈ టాస్క్ లు పెట్టిన బిగ్ బాస్ నిన్న ఆఖరి టాస్క్ పెట్టాడు. మీ సర్వైవల్ కోసం నేను ఇస్తున్న టాస్క్ ఫైట్ ఫర్ సర్వైవల్.. గార్డెన్ ఏరియాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటితో నిండే పూల్స్ ఉన్నాయి.. అందులో నీళ్లు చల్లగా ఉండొచ్చు కానీ అవే మీకు అగ్నిపరీక్ష.. ఎందుకంటే స్టార్ట్ బజర్ మోగగానే డేంజర్ జోన్‌లో ఉన్న సభ్యులు తమకు కేటాయింటిన పూల్స్‌లోకి వెళ్లి అందులో ఉన్న రోప్స్‌ని పట్టుకొని పూర్తిగా పడుకోవాలి.. ఆ పూల్స్‌కి కనెక్ట్ చేసిన ట్యాప్స్ ద్వారా ఆ పూల్స్‌లో నీరు క్రమంగా ప్రతి సెకను మీ సహనాన్ని మీ శ్వాసని మీ ధైర్యాన్ని పరీక్షిస్తాయి.. సేఫ్ జోన్‌లో ఉన్న సభ్యులు డేంజర్ జోన్‌లో ఉన్న ఎవరిని డేంజర్ జోన్ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల పూల్‌లో నీటిని బకెట్‌తో బయటికి తీసి డేంజర్ జోన్‌లోనే ఉంచాలనుకుంటున్న సభ్యుని పూల్‌లో వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ రూల్స్ చెప్పగా ఈ టాస్క్ కి ఫ్లోరా సైనీ సంఛాలక్ గా ఉంది. ఈ టాస్క్ లో మొదటగా సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవ్వగా, తర్వాత డీమాన్, కాసేపటికి రీతూ ఎలిమినేషన్ అయ్యారు. ఇక చివరి దాకా సంజన, తనూజ ఉండగా.. సంజన పూల్ లో ఎక్కువ నీళ్ళు ఉండటంతో తను ఎలిమినేట్ అయింది. ఇక ఈ టాస్క్ లో తనూజ గెలిచి సేఫ్ అయ్యింది.
ఇక చివరగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. పోటీదారులు అందరూ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చొని ఉంటారు. వారి నెత్తిన ఒక బల్డ్ వేలాడుతూ ఉంటుంది. బజర్ మోగినప్పుడల్లా సంచాలకులు ఛైర్స్‌లో కూర్చున్న పోటీదారుల్లో ఒకరిని ఎంచుకొని వారి భుజంపై టచ్ చేస్తారు. అప్పుడు ఆ పోటీదారులు తమ కళ్లకి ఉన్న గంతలు తీసి మిగిలిన సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని వారి లైట్‌ని ఆఫ్ చేయాలి. వెంటనే తిరిగి తమ ఛైర్‌లో కళ్లకి గంతలు కట్టుకొని కూర్చోవాలి. ఆ తర్వాత అందరూ గంతలు ఓపెన్ చేస్తారు. ఎవరి లైట్ అయితే ఆఫ్ చేసి ఉంటుందో వారు.. ఇది చేసిందెవరో గెస్ చేయాలి. వారు గెస్ చేసిన సభ్యులు లైట్ ఆఫ్ చేసిన సభ్యులు ఒకరే అయితే ఆ లైట్ ఆఫ్ చేసిన సభ్యులు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. ఈ టాస్క్ లో మొదటగా దివ్య సరిగ్గా గెస్ చేసింది. ఆ తర్వాత కళ్యాణ్, కాసేపటికి తనూజ.. ఇలా అందరు గెస్ అయిన తర్వాత చివరికి తనూజ, కళ్యాణ్ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావడానికి అర్హులో డిసైడ్ చేసుకోమని హౌస్ మేట్స్ కి చెప్పాడు బిగ్ బాస్. ఇక అందరు కలిసి పవన్ కళ్యాణ్ ని కెప్టెన్ గా డిసైడ్ చేశారు. అయితే ఇందులో ఇమ్మాన్యుయల్, సంజన, భరణి మాత్రమే తనూజకి సపోర్ట్ చేశారు. మిగతావారంతా కళ్యాణ్ కి సపోర్ట్ చేయడంతో అతను కెప్టెన్ గా గెలిచాడు. కెప్టెన్ అయిన కళ్యాణ్ కెప్టెన్సీ బ్యాండ్ ని దివ్య నిఖిత చేతుల మీదుగా తీసుకున్నాడు. ఎందుకంటే అంతకముందు కళ్యాణ్ ని వరెస్ట్ ప్లేయర్ అని దివ్య చెప్పిందంట. ఇలా అయిదో వారం పవన్ కళ్యాణ్ కెప్టెన్ గా గెలిచాడు.