English | Telugu

Bigg Boss 9 Double Elimination: డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. ఈ వారం దివ్య, సంజన అవుట్!

బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. పన్నెండో వారం కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ డీమాన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ పడాల మధ్య జరుగగా.. పవన్ కళ్యాణ్ గెలిచి చివరి ఇంటి కెప్టెన్ అయ్యాడు.

ఇక నామినేషన్లో కెప్టెన్ రీతూ తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు. ‌సోమవారం అర్థరాత్రి నుండి శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన ఓటింగ్ లో ఎవరికి ఎంత ఓటింగ్ పడిందో ఓసారి చూసేద్దాం. సోషల్ మీడియా చెబుతున్న లెక్కల ప్రకారం, పవన్ కళ్యాణ్ పడాల 32.66 శాతం ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. 26.99 శాతం ఓటింగ్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. 9.14 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయల్ మూడో స్థానంలో ఉన్నాడు. 6.56 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 6.44 శాతం ఓటింగ్ తో భరణి ఐదో స్థానంలో ఉన్నాడు. 6.39 శాతం ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక సంజనా గల్రానీ, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు.

Also Read: ప్రభాస్, అనుష్క పెళ్ళి.. వైరల్ గా మారిన వీడియో!

సంజనా గల్రానీ , దివ్య నిఖిత ఇద్దరిలో దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతవారం కూడా తనే ఎలిమినేట్ అయ్యేది కానీ పవరస్త్ర వాడటం వల్ల తను సేవ్ అయ్యింది. ఈ వారం తనకే తక్కువగా ఓటింగ్ పడింది. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే సంజనా గల్రానీ, దివ్య నిఖిత ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య కన్ఫమ్ ఎలిమినేట్ అవుతుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.