English | Telugu

Bigg Boss 9 Telugu: గిన్నె తెచ్చిన పెంట.. రీతూపై అయేషా వైల్డ్ ఫైర్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి పాత కంటెస్టెంట్స్ కి మధ్య పోటాపోటీగా మాటల యుద్ధం సాగుతోంది. ఏది మాట్లాడిన అక్కడ గొడవ అవుతుంది. కంటెంట్ కోసమో తెలియదు అది నిజమో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి ఎపిసోడ్ లో ఓ వైపు మాధురి డామినేషన్ సాగగా మరోవైపు అయేషా డామినేషన్ నడిచింది. నిన్నటి ఎపిసోడ్ లో ఒక్క గిన్నె తోమడం కోసం ఇద్దరు గొడవపడ్డారు. అదేంటో ఓసారి చూసేద్దాం.

ఉదయాన్నే గిన్నెలు తోమడానికి వెళ్లి రీతూ తిట్టుకుంది. ఎవరైనా తినడం లేటయ్ అర్ధరాత్రి తినేవాళ్లయితే తీసి పక్కన పెట్టుకోమని చెప్పు కళ్యాణ్.. పొద్దున్న నా వల్ల అవ్వదనే కదా నైట్ గిన్నెలు తోముతుంది.. మళ్లీ పొద్దున్న వేస్తే ఎలా.. అంటూ రీతూ చిరాకు పడింది. ఇదే విషయం దివ్యకి కూడా చెప్పింది. దీంతో కళ్యాణ్ వెళ్లి.. గిన్నెలు తోమడానికి పెట్టిన మరో హౌస్‌మెట్ అయేషా దగ్గరికెళ్లాడు. రీతూ రాత్రి అన్ని డిషెస్ వాష్ చేసింది కానీ ఎవరో మార్నింగ్ దోశ పిండి గిన్నె అక్కడ పెట్టారు.. అది నువ్వు చేస్తావా అని అడిగాడు. లేదు నేను ఎందుకు చేస్తాను.. బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్ వరకు వాడిన గిన్నెలు మాత్రమే నావి.. తర్వాత రీతూ పని అని అయేషా అంది. కాసేపటికి డిషెస్ వాష్ చేయడానికి అయేషా కిచెన్‌లోకి వెళ్లింది. అక్కడ రాత్రి వాడిన దోశ పిండి గిన్నె కనిపించింది.

దీంతో రీతూ ఇక్కడ బ్యాలెన్స్ పెట్టింది ఫినిష్ చేస్తావా.. నాకు ఇటు స్పేస్ కావాలని చాలా సింపుల్‌గా నెమ్మదిగా రీతూని అయేషా అడిగింది. నేను క్లియర్‌గా కెప్టెన్‌కి చెప్పాను.. అక్కడ నేను అన్నీ క్లియర్ చేశాను.. అక్కడ ఉన్నవి నేను క్లియర్ చేయను.. అక్కడ పెట్టుంటేనే నేను చేస్తానని చెప్పాను.. పొద్దున్న సింక్‌లో వేశారు ఆ గిన్నె అంటూ రీతూ చెప్పింది. ఈ గిన్నె నిన్న నైట్‌ది అని అయేషా చెప్పింది. నిన్న నైట్ రెండు సింక్‌ లు ఖాళీగా ఉన్నాయి అదే చెప్పాను. పిండి ఉంది నైట్ ఆ గిన్నెలో అంటూ రీతూ చెప్పింది. డ్యూటీ గురించి చెప్పినప్పుడు నువ్వే చెప్పావ్ నైట్ చేయకపోతే మార్నింగ్‌కి కూడా యాడ్ అవుతుందని.. ఇదే నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని అయేషా సూటిగా అడిగింది. రేషన్ మేనేజర్ ప్లీజ్ టాక్.. నేను పొద్దున్న కూడా నీకు ఏం చెప్పానంటూ దివ్య వైపు చూసింది రీతూ. ఇది నిన్నటిదంటే నీ డ్యూటీ కూడా నేనే చేయాలా.. అన్నీ నేనే తోమాలా.. అని అయేషా అడిగింది. అది నిన్నటిదే నేను చెప్పేది విను అయేషా.. అని రీతూ అరిచింది. దీంతో ఏం వినాలి చెప్పు.. అంటూ అయేషా రెయిజ్ అయింది. అది నైట్ తీయలేదు అందులో పిండి ఉంది చెప్తున్నా కదా.. అంటూ రీతూ అంది.

అది నైట్‌ది నేను ఎందుకు తోమాలి.. అని అయేషా స్టార్ట్ చేసింది. ఇంతలో కళ్యాణ్ మధ్యలో మాట్లాడాడు. అయేషా పాయింట్ ఏంటంటే అది రాత్రి వాడిన గిన్నె కదా నేనెందుకు కడుగుతాను అంటుంది.. రీతూ పాయింట్ ఏంటంటే అది ఉదయాన్నే వేశారు కదా.. అని కళ్యాణ్ చెప్పాడు. ఇది నేను కడగను అని చెప్పట్లేదు అర్ధరాత్రి వేశారు అంటున్నాను.. అని రీతూ చెప్పింది. అవన్నీ నాకు అవసరం లేదురా నువ్వు తర్వాత చేస్తావ్ కదా.. అని అయేషా అడిగితే చేస్తాను.. అని రీతూ అంది. సరే పక్కన పెట్టనా.. అయిపోయింది అంతే.. అని అయేషా కట్ చేసింది. కానీ రీతూ మళ్లీ సాగదీసింది. అయిపోయింది కాదు నువ్వు మాటలు అనేసి అయిపోయింది అంటే కాదంటూ రీతూ అంది. మరి మాట్లాడటం అయిపోతే అయిపోయిందనే అంటారు. లేకపోతే మాట్లాడుతూనే ఉండాలా రోజంతా నీతో అంటూ అయేషా చెప్పింది. మరి నువ్వు అనకుండా ఉండమని రీతూ అంటే సరేరా అయిపోయింది రీతూ అని మళ్లీ గట్టిగా అరిచింది అయేషా.

పని నువ్వు చేయకపోతేనే కదా నేను అడుగుతున్నాను.. ఊరికే నేనేం నీ గురించి చెప్పలేదు రీతూ.. ఫస్ట్ నువ్వు కరెక్ట్‌గా ఉండు రీతూ.. అంటూ అయేషా వాయిస్ రెయిజ్ చేస్తూనే ఉంది. రీతూ కూడా చాలా వరకూ అరిచింది కానీ అయేషా వాయిస్ ముందు తేలిపోయింది. నువ్వు కూడా ఉండమని రీతూ అంటే నువ్వు ఉండవే ఫస్ట్.. నువ్వు ఉండు.. నువ్వు ఊరుకోవే.. నువ్వు ఊరుకో.. ఏం పని చేయవు అడిగితే న్యన్యన్య అంటావంటూ అయేషా వెక్కిరించింది. దీంతో ఏంటి అది మాటలు సరిగా మాట్లాడమంటూ రీతూ మళ్లీ వాదించింది. ఇంతలో అయేషా అయేషా అంటూ కళ్యాణ్ పిలిచాడు. ఏంటి నాతో వద్దు కళ్యాణ్.. ఎందుకు నన్ను పిలుస్తున్నావ్ అక్కడ ఆపలేకుండా అని కళ్యాణ్‌పై సీరియస్ అయింది అయేషా. నేను అక్కడ ఆపాను సౌండ్.. అక్కడ ఆగాక నువ్వు మళ్లీ అరుస్తున్నావని కళ్యాణ్ అన్నాడు. అక్కడ అరిచే దాన్ని బట్టి నా రియాక్షన్ వస్తుంది కళ్యాణ్ అంటూ అయేషా సూటిగా చెప్పింది. అయేషా , రీతూ చౌదరి మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్ట్ కామెంట్ చేయండి.