English | Telugu
బాలు గారిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం
Updated : Oct 16, 2025
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కి ఫాన్స్ అంతా ముద్దుగా పిలుచుకునే కిల్ బిల్ పాండే అలియాస్ బ్రహ్మానందం షోకి గెస్ట్ రా వచ్చారు. నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఆయన స్టేజి మీదకు రాగానే హోస్ట్ శ్రీరామా చంద్ర వెళ్లి కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక జడ్జెస్ కూడా లేచి నిలబడ్డారు. "మీరు వచ్చినందుకు చాల చాలా ఆనందంగా ఉంది సర్. అల్లాడిపోతున్నాను సర్" అంటూ హోస్ట్ సమీరా భరద్వాజ్ అనేసరికి బ్రహ్మానందం షాక్ అయ్యారు. "మీ స్టైల్ లో కంటెస్టెంట్స్ కి ఒక ఆల్ ది బెస్ట్" చెప్పండి అనేసరికి ఫన్నీగా చెప్పి అందరినీ నవ్వించారు ఆయన.
అలాగే తర్వాత లేడీ రాక్ స్టార్ బృందా వచ్చి "నరుడా ఓ నరుడా" అనే సాంగ్ పాడింది. "భగవంతుడు నీలాంటి వాళ్ళ లిస్ట్ తీసుకుని టిక్ చేసి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించాలని నేను మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ ఆమెను బ్లెస్స్ చేశారు బ్రహ్మానందం. తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలిసి "వారేవా ఏమి ఫేసు" అనే సాంగ్ పాడి బ్రహ్మానందంకి డేడికేట్ చేశారు. దాంతో ఆయన "నన్నెందుకు ఇలా టార్గెట్ చేశారో అర్ధం కావట్లేదు" అన్నారు. తర్వాత హోస్ట్ శ్రీరామచంద్ర "బ్రహ్మానందం సర్..మీకు ఎస్పీ బాలు గారికి మధ్య చిన్న ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా" అని అడిగాడు. "చిన్న అనుబంధం కాదు పెద్దదే. కుటుంబ సాన్నిహిత్యం ఉంది. ఆయన చాలామంచి మనిషి . ఆయన" అంటూ ఇక చెప్పలేక కన్నీళ్లు కారుస్తూ అలా బాధపడుతూనే ఉన్నారు.