English | Telugu
మైక్ విసిరేసిన అశ్వగంధ 2.0.. సారీ చెప్పిన అవినాష్!
Updated : Oct 10, 2024
హౌస్ లోకి మాస్క్ పెట్టుకొని రావడం.. అందరు చూసి గౌతమ్ అంటే పలకకుండా.. అశ్వత్థామ అనగానే మాస్క్ తీసి అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ తనే హౌస్ లో ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న గౌతమ్.. ఇప్పుడు అదే మాట అవినాష్ అంటే హర్ట్ అయి ఆమ్లెట్ అయిండు. అసలేం ఏం అయిందంటే.. నిన్న హౌస్ లో బిబి హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఇక దీని ముందు హౌస్ లో సరదాగా చిన్న టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ని రెండు టీమ్ లుగా చేసి, అమ్మాయిల లీడర్ అవినాష్.. అబ్బాయిల లీడర్ రోహిణి అని చెప్పాడు. మీరు కన్ఫ్యూజ్ అయినట్లున్నారు బిగ్ బాస్ అని అవినాష్ అనగానే.. నేను కరెక్ట్ గానే చెప్పానని బిగ్ బాస్ మామ అనేసాడు. మొదటి రౌండ్ నవ్వుకుండా ఉండటానికి ప్రయత్నించు.. టీమ్ సభ్యులు అందరూ వారి నోటిని నీటితో నింపుకోవాల్సి ఉంటుంది.. ఎదుటి టీమ్ నుంచి ఒకరు వచ్చి జోక్స్ చెప్పి వారిని నవ్వించి నోటిలో నీటిని బయటికొచ్చేలా చేసి వారిని ఔట్ చేయాలి.. ఇలా రెండు టీమ్స్ ఒకరి తర్వాత ఒకరు చేయాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇక మొదట రోహిణి ప్రయత్నించింది కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత అవినాష్ వెళ్ళాడు. అఖిలాండ కోటి అంటు మణికంఠ లాగా పాడాడు కానీ అతను నవ్వలేదు కానీ అపరిచితుడులోని క్యారెక్టర్ తో అవినాష్ చేశాడు..రేయ్ అని అనడంతో నవ్వేశాడు మణికంఠ. ఇక ఆ తర్వాత గౌతమ్ దగ్గరికి వెళ్ళిన అవినాష్..గత సీజన్లో గౌతమ్ అన్నట్టుగా అన్నాడు.
అశ్వత్థామ 2.0 వచ్చాడంటూ గౌతమ్ దగ్గరికెళ్లి నవ్వించడానికి ట్రై చేశాడు అవినాష్. ఇంతలో స్టేజ్ దిగిపోయి.. "సరేసరే బ్రో ఒన్ సెకండ్.." అంటూ అరిచాడు గౌతమ్. అసలు ఎవరికీ ఏం అర్థం కాలేదు. అశ్వత్థామ అన్నది సీజన్-7లో అయిపోయింది. అది మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించకు బ్రో.. అంటూ గౌతమ్ సీరియస్‌గా అన్నాడు. దీనికి ఏదో కామెడీ చేస్తే ఏంటి బ్రో అంటూ అవినాష్ అన్నాడు. అది కామెడీ కాదు బ్రో నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది బ్రో అంటూ మైక్ కింద పడేసి గౌతమ్ లోపలికి వెళ్లిపోయాడు. ఇక దీనికి హర్ట్ అయిన అవినాష్.. నేను స్టార్టింగ్‌లోనే ఎవరు హర్ట్ అవ్వొద్దని చెప్పా.. నేను ఈ టాస్కు ఆడను బిగ్‌బాస్ అంటూ అవినాష్ కూడా సీరియస్ అయ్యాడు.
ఇక తర్వాత లోపలికి వెళ్లి ఒంటరిగా కూర్చొని గౌతమ్ ఏడ్చాడు. దీంతో అవినాష్ సహా అందరూ గౌతమ్ దగ్గరికెళ్లి ఓదార్చారు. "అది నాకు సీజన్ 7లో బాగా ట్రోలింగ్ అయిందని అది (అశ్వత్థామ) తీయొద్దు తీయొద్దని చెప్పా..నేను నార్మల్‌గా ఏడవను.. కానీ లోపల అది నాకు పిండేస్తుంది.. అప్పుడు నా మైండ్ సెట్ వేరు.. వన్ ఇయర్ క్రితం.. నన్ను ఒక్కొక్కడు ఒక్కోలా ట్రీట్ చేస్తుంటే.. నేను తట్టుకోలేక అన్న మాట అది.. అది ఎంతమందికి చెప్పాలి బ్రో.. నాకు ఇప్పుడు కూడా అది అయ్యేవరకూ ఆగుదామనుకున్నా.. కానీ అనుకోకుండా వచ్చేసింది.. సారీ.. మిమ్మల్ని అందామని కాదు.." అంటూ గౌతమ్ సారీ చెప్పాడు. ఇక హౌస్‌మెట్స్ అందరూ కూడా ఇంకెప్పుడు అశ్వత్థామ అనం అంటూ మాటిచ్చారు.