English | Telugu
బిగ్ బాస్ సీజన్ 6 కి సెంటిమెంట్ డేట్?
Updated : Jul 26, 2022
బిగ్ బాస్ సీజన్ 6 కి అంతా సిద్దమయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ పూర్తయిన వెంటనే బిగి్ బాస్ సీజన్ 6ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఓటీటీ వెర్షన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ సారి సీజన్ 6 మరింత కొత్తగా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా వుండాలని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం కోసం టైమ్ తీసుకున్నారు. ఓటీటీ షో ఫ్లాప్ కావడంతో దాని ప్రభావం సీజన్ 6 పై పడకుండా జాగ్రత్తు తీసుకున్నారు.
కంటెస్టెంట్ ల ఎంపిక నుంచి టాస్క్ ల వరకు ప్రతీదీ కొత్తగా వుండాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్ తో పోయిన పరువుని తిరిగి రాబట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందు కోసం కలిసి వచ్చిన సెంటిమెంట్ డేట్ ని ఫైనల్ చేశారట. తాజా సమాచారం ప్రకారం సీజన్ 6 ని సెప్టెంబర్ 4న ఆదివారం నాడు ప్రారంభించబోతున్నారట. నాగార్జున ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇంత వరకు సీజన్ 4 సెప్టెంబర్ లోనే మొదలైంది. ఆ తరువాత సీజన్ 5 కూడా సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేశారు. ఈ రెండు సీజన్ లు మిగతా సీజన్ లని మించి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ నెల ని సెంటిమెంట్ భావించి సీజన్ 6న ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట.
సీజన్ 4 సెప్టెంబర్ లో స్టార్టయి మంచి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తొలి సీజన్ టీఆర్పీని అధిగమించి రికార్డు సాధించింది. ఇక ఇండియాలో ఏ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు రాని వీవర్ షిప్ ని సీజన్ 4 సొంతం చేసుకోవడం విశేషం. ఇక సీజన్ 5 కూడా సెప్టెంబర్ లోనే మొదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే రేటింగ్ లో కాస్త సీజన్ 4 కంటే వెనకబడింది. ఏది ఏమైనా బిగ్ బాస్ టీఆర్పీని పెంచిన సెప్టెంబర్ నెలని సెంటిమెంట్ గా భావిస్తున్న స్టార్ మా వర్గాలు తాజా సీజన్ ని కూడా సెప్టెంబర్ 4న ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.