English | Telugu
తిరువీర్ .. అసలు పేరేమిటో ఎవరికైనా తెలుసా ?
Updated : Sep 13, 2022
ఆలీతో సరదాగా షోలో ఈ వారం మసూదా మూవీ టీం నుంచి కావ్య, సంగీత, తిరువీర్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఈ మూవీలో హీరోగా చేస్తున్న తిరువీర్ ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తిరువీర్ అనే నీ పేరు వెనక కథేంటి ఎవరు మార్చారు అని ఆలీ అడిగారు.." మా అమ్మ పెట్టిన పేరు నాకు తిరుపతి. మా అమ్మ పేరు వీరమ్మ. థియేటర్ ఆర్ట్స్ లో నాకు బాగా ఇష్టమైన నా డైరెక్టర్ పేరు రఘు వీర్. అమ్మ పేరులో వీర్ , ఈయన పేరులో వీర్ నాకు ఎంతో నచ్చింది. దాన్ని తీసుకొచ్చి తిరుకి తగిలిద్దామని అనిపించి అలా తిరువీర్ అని నాకు నేనే పేరు మార్చేసుకున్నా. నా పేరు చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు...తెలుగు వాడా , తమిళ్ వాడా అని అడుగుతుంటారు.
తెలుగొచ్చా అని చాలా మంది అడిగారు నన్ను. సౌత్ కొరియా కూడా వెళ్లాను. థియేటర్ వర్క్ షాప్ కోసం వెళ్లాను. అక్కడ మిస్టర్ సాంగ్ అని ఒకాయన ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం ఐదు దేశాల నుంచి పార్టిసిపంట్స్ వచ్చి ఇక్కడ థియేటర్ రెసిడెన్స్ చేస్తారు. ఆ టైంలో థియేటర్ కి సంబంధించి కల్చరల్ ఎక్స్చేంజి జరుగుతుంది. అలా 23 రోజుల పాటు ఆ వర్క్ షాప్ జరుగుతుంది. అక్కడ అన్ని పనులు మేమే చేసుకోవాలి. అలా అక్కడికి వెళ్లి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను " అన్నాడు తిరువీర్.