English | Telugu
బిగ్ బాస్ 5 స్టార్టయింది.. ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు!
Updated : Sep 5, 2021
బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 5వ సీజన్ ఈరోజు (సెప్టెంబర్ 5) మొదలైంది. ఈ టాప్ రియాలిటీ గేమ్ షో స్టార్ మా చానల్‌లో సాయంత్రం 6 గంటలకు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు సూపర్ హిట్ సాంగ్ 'ఒక లైలా కోసం' సాంగ్‌ను హోస్ట్ కింగ్ నాగార్జున పర్ఫామ్ చేయడంతో సూపర్‌గా స్టార్టయింది. ఆ తర్వాత ఆడియెన్స్‌కు బిగ్ బాస్ హౌస్ లోపల ఎలా ఉందో పరిచయం చేశారు నాగ్. డైనింగ్ హాల్, వాష్‌రూమ్, లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్, మోజ్ అనే ఫన్ రూమ్ లాంటివి అందులో ఉన్నాయి. ఈసారి హౌస్‌లోకి అత్యధికంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు.
ఫస్ట్ కంటెస్టెంట్‌గా యాంకర్, నటి సిరి హన్మంత్ హౌస్‌లోకి అడుగుపెట్టగా, ఆ తర్వాత వరుసగా టీవీ యాక్టర్ సన్నీ, లహరి షహ్రీ, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామచంద్ర, కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్, యాక్టర్ లోబో, సినీ-టీవీ నటి ప్రియ, మోడల్ జెస్సీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంకా సింగ్, పాపులర్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, హమీదా, డాన్స్ మాస్టర్ నటరాజ్, టీవీ తార సరయు రాయ్, యాక్టర్ విశ్వ, నటి ఉమాదేవి, యాక్టర్ మానస్, ఆర్జే కాజల్, నటి శ్వేతావర్మ, యాంకర్ రవి.. హౌస్‌లోకి వచ్చారు. తాము బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు వచ్చారనది ప్రతి కంటెస్టెంట్ వీడియో రూపంలో ప్రజెంట్ చేశారు.
నటరాజ్ భార్య ఏడవ నెల గర్భవతి ఉందనే విషయం తెలిసినప్పుడు ఎమోషనల్ ఎట్మాస్ఫియర్ ఏర్పడింది. అలాంటి స్థితిలో బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి అతను వెనుకాడినా భార్య మాత్రం అతడిని వెళ్లమంటూ తానే ఎంకరేజ్ చేశానని తెలిపింది. అందంగా కనిపించే ప్రియలో తనేమిటో నిరూపించుకోవాలనే ఫైర్ ఉందనీ, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి హౌస్‌లోకి వచ్చిందనీ తెలిసింది. ఆనీ మాస్టర్ తనతో ఒక స్టెప్ వేయాల్సిందిగా నాగ్‌ను కోరితే, ఇప్పుడు కాదంటూ సున్నితంగా తిరస్కరించారు. ఉమాదేవి పర్సనల్ లైఫ్ ఎక్కువగా కష్టాలతో నిండివుందని విన్నప్పుడు బాధనిపించింది. కంటెస్టెంట్లు అందరిలోకీ వయసులో ఆమే పెద్దది.
ఫస్ట్ ఎపిసోడ్ అంతా కంటెస్టెంట్ల పరిచయంతోనే సరిపోయింది కాబట్టి, ఆడియెన్స్ ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయింది. వాళ్లకు సంబంధించిన ఏవీలలో చెప్పిన, చూపించిన విషయాలే కాస్త అలరించాయి, ఆకట్టుకున్నాయి.