English | Telugu
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్
Updated : Feb 15, 2022
బిగ్‌బాస్ సీజన్ 5 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ లో విజే సన్నీ విజేతగా, షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ నిలవడం తెలిసిందే. అయితే ఈ సీజన్ ఓ రేంజ్ లో రచ్చకు తెరలేపింది. చివరి వారాల్లో షణ్ముఖ్, సిరిల మధ్య జరిగిన ఎపిసోడ్ నెట్టింట బిగ్‌బాస్ పై విమర్శలు కురిపించింది. షో నిర్వాహకులపై నెటిజన్స్ మండిపడేలా చేసింది. ఇదిలా వుంటే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే వేదికగా హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్ ఓటీటీ షో గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఓటీటీ బిగ్‌బాస్ షో పై రక రకాల వార్తలు పుట్టుకొస్తూనే వున్నాయి.
ఫైనల్లీ.. అఫీషియల్ గా ఓటీటీ రియాలీటీ షోకు సంబంధించిన ప్రోమోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చేసింది. 24 గంటల పాటు సాగే ఈ షో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది?.. కంటెస్టెంట్స్ ఎంత మంది ఎవరెవరు అన్న డిటైల్స్ తాజాగా బయటికి వచ్చాయి. ఈ సీజన్ లో 16 నుంచి 18 మంది కంటెస్టెంట్ లు వుంటారని, ఇప్పటికే వారిని నిర్వాహకులు ఎంపిక చేశారని, ఈ నెల 15 నుంచి వారంతా క్వారెంటైన్ కు వెళ్లబోతున్నారని తెలిసింది.
Also Read:పెళ్లి కాకుండానే విడాకులా?.. బిగ్ బాస్ హిమజ ఫైర్!
ఈ నెల 26 నుంచే ఓటీటీలో బిగ్ బాస్ రియాలిటీ షో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోందని తెలిసింది. ఇందులో గత సీజన్ లలో పాల్గొన్న వారితో పాటు కొత్త వారు కూడా వుండబోతున్నారు. వారిలో యాంకర్ స్రవంతి, యాంకర్ శివ, విశ్వక్, అర్జున్, అనిల్ రాథోడ్ (మోడల్), మహేష్ విట్టా, అషురెడ్డి, 7 ఆర్ట్స్ సరయు, అఖిల్, అరియానా తదితరులు ఇప్పటి వరకు ఫైనల్ అయిన కంటెస్టెంట్ లు. ఈ షోకు కూడా నాగార్జననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.