Home

»

Tv News

పెళ్లి కాకుండానే విడాకులా?.. బిగ్ బాస్ హిమజ ఫైర్!

Jan 28, 2022 1:32PM

ఇటీవల సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ హిమ‌జ కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకోడానికి సిద్ధమైందని న్యూస్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను హిమ‌జ ఖండించింది. అసలు పెళ్లే కాకుండా విడాకులు ఎవరికి ఇస్తానంటూ హిమజ సంచలన వ్యాఖ్యలు చేసింది.

విడాకుల వార్తలను ఖండిస్తూ హిమ‌జ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేసింది. తన పెళ్లి, విడాకుల గురించి ఫేక్ న్యూస్ వస్తున్నాయని, నార్మల్ గా అయితే వీటిని పట్టించుకునే దానిని కాదని, కానీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి స్పందించాల్సి వస్తుందని చెప్పింది. 

తనకి తెలియకుండానే తన పెళ్లి చేసేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారని హిమజ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను సింగల్ గా హ్యాపీగా ఉన్నానని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పి ఘనంగా చేసుకుంటానని తెలిపింది. బుద్ధిలేనోడు ఎవడో డబ్బులిచ్చి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాడని, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసేముందు మీడియా వాళ్ళు కొంచెం ఆలోచించాలని హిమజ కోరింది. ఈ ఫేక్ న్యూస్ పై తాను సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు కూడా చేశానని హిమజ తెలిపింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com