English | Telugu
`జబర్దస్త్` బ్యాచ్ రెమ్యునరేషన్ లు ఇదుగో
Updated : Feb 15, 2022
బుల్లితెర పాపులర్ కామెడీ షో `జబర్దస్త్`. హాస్య ప్రియుల్ని గత కొన్నేళ్లుగా విశేషంగా ఆకట్టుకుంటూ రేటింగ్ పరంగా దూసుకుపోతోంది. ఎంతో మందికి అవకాశాల్ని అందిస్తూ చాలా మంది జీవితాల్లో కొత్త వెలుగులు చిమ్ముతోంది. ఈ షో కారణంగా చాలా మంది కామెడీ స్టార్ లు గా మారిపోయారు. కొంత మందైతే స్టార్ లు అయ్యారు కూడా. రష్మీ గౌతమ్, అనసూయ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆదీ, గెటప్ శ్రీను ఏకంగా సినిమా అవకాశాలనే సొంతం చేసుకుంటూ అక్కడ కూడా బిజీ అయిపోతున్నారు.
ఎంత బిజీగా వున్నా జబర్దస్త్ ని మాత్రం వీడటానికి ఇష్టపడటం లేదు. కారణం వారిచ్చే రెమ్యునరేషన్ లే. నాగబాబు ఈ షో నించి వెళ్లిపోయాక జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా, మనోల పారితోషికాలతో పాటు టీమ్ మెంబర్ ల రెమ్యునరేషన్ లు కూడా భారీగా పెరిగిపోయాయి. షో కూడా భారీ టీఆర్పీని సొంతం చేసుకుంటుండటం, ప్రముఖ బ్రాండ్ లు స్పాన్సర్ లు గా ముందుకు రావడంతో ఇందులో పాల్గొంటున్న వారికి పారితోషికాలు భారీగానే వుంటున్నాయి.
Also Read: మనసులో కోరిక బయటపెట్టిన రోజా.. పంచ్ వేసిన హైపర్ ఆది
మొదట్లో రోజా మూడు నుంచి నాలుగు లక్షలు మాత్రమే తీసుకుందట. అయితే ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కు 8 లక్షలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. రోజాతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఎపిసోడ్ కి 2 లక్షలు తీసుకుంటున్నారట. ఇక అనసూయ మొదట్లో ఎపిసోడ్ కు 50 వేలు నుండి 80 వేలు తీసుకునేవారట. కానీ ఇప్పుడు మాత్రం లక్షన్నర నుంచి రెండు లక్షలు తీసుకుంటోందని చెబుతున్నారు.
Also Read:హైపర్ ఆది.. అనసూయకు చెప్పిన ఆ టింగులేంటీ?
రష్మి కూడా అదే పారితోషికం అందుకుంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ఈ ముగ్గురూ కలిపి దాదాపు నాలుగు లక్షలు తీసుకుంటున్నారట. హైపర్ ఆది కూడా ఇదే స్థాయిలో అందుకుంటున్నట్టుగా చెబుతున్నారు. రాకెట్ రాఘవ నెలకు రెండు లక్షలు తీసుకుంటున్నారని, చలాకీ చంటి కూడా అదే పారితోషికం అందుకుంటున్నారని అంటున్నారు.