English | Telugu

నా బఱ్ఱె 20 లీటర్ల పాలు ఇస్తుంది..మీ తాత ఇస్తాడా

ఎక్స్ట్రా జబర్దస్త్ ఈవారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది..నెక్స్ట్ వీక్ ప్రోమో దుమ్ము లేపేదిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు లాడీ కమెడియన్స్ కం బ్యాక్ ఇచ్చారు. వాళ్ళే రౌడీ రోహిణి, ఫైమా. ఇక రావడంతోనే షో మొత్తం కలర్ ఫుల్ గా మారిపోయింది. ఆటో రాంప్రసాద్ టీమ్ లో వచ్చేసింది రోహిణి. అలాగే బులెట్ భాస్కర్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఫైమా. రావడంతోనే వాళ్ళ మార్క్ కామెడీని చూపించారు.

రాంప్రసాద్ ఫ్రస్ట్రేషన్ సెంటర్ పేరుతో ఒక సెంటర్ ని పెట్టడంతో అక్కడికి దొరబాబు వచ్చి తనకు చాల ఫ్రస్ట్రేషన్ ఉందని చెప్పేసరికి రాంప్రసాద్ న్యూ ఎంప్లాయ్ రామ్మా అని పిలిచాడు. ఆ పిలుపుకు లోపల నుంచి రోహిణి వచ్చింది.."వీళ్ళ ఆవిడ పేరు అమ్ము అంట.. ఆవిడ చాల ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తోందట అతను కొంచెం ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడు అనేసరికి దొరబాబు రోహిణిని తీసుకుని వెల్లబోతాడు.."ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి వెనక్కి వెళ్తావేంట్రా...ఇక్కడే ఉండు" అనేసరికి దొరబాబు షాకైపోయాడు.

ఇక ఫైనల్ లో భాస్కర్ , ఫైమా స్టేజి మీదకు వచ్చారు. ఫైమా రాకతో భాస్కర్ తెగ ఆనందపడిపోతూ ఉన్నాడు . ఇంతలో ఫైమాకి ఫోన్ రావడం అవతల నుంచి తన గేదె చనిపోయిందని తెలిసేసరికి ఫైమా ఏడవడం చూసాడు భాస్కర్. "వారం క్రితం మా తాత చనిపోయాడు ఐనా నేను ఏడవలేదు. ఒక బఱ్ఱె చనిపోతే ఇంతలా ఏడుస్తావా" అని భాస్కర్ అనేసరికి "నా బఱ్ఱె 20 లీటర్ల పాలు ఇస్తుంది. మీ తాత ఇస్తాడా" అని ఫైమా ఏడుస్తూనే అడిగేసరికి భాస్కర్ షాకైపోయాడు. ఇక నెటిజన్స్ ఈ ప్రోమోని చూసి రోహిణి, ఫైమా కం బ్యాక్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..