English | Telugu

Bharani Out of The Captaincy Task: కెప్టెన్సీ రేసు నుంచి భరణి అవుట్.. కూతురి డ్రీమ్ నెరవేరేనా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ తర్వాత నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక ఆ తర్వాత హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లు ఆడించడానికి హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ వచ్చారు. గౌతమ్ హౌస్ లోకి పంచకట్టులో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే అందరి ఆటతీరు చెప్పాడు. సుమన్ గారు మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు.. మీరంటే చాలా ఇష్టం అని చెప్పి సుమన్ ని హగ్ చేసుకుంటాడు గౌతమ్. హౌస్ లో ఫన్ క్రియేట్ చెయ్యడానికి ఇద్దరు ఇద్దరిగా వెళ్లి అమ్మాయిలని ఫ్లర్టింగ్ చేయాలని గౌతమ్ చెప్తాడు.

దాంతో మొదటగా సంజనని భరణి ఫ్లర్టింగ్ చేస్తాడు. వాళ్ళ మధ్యలోకి సుమన్ వచ్చి సంజనని ఫ్లర్ట్ చేస్తాడు. ఆ తర్వాత రీతూని కళ్యాణ్, దివ్యని ఇమ్మాన్యుయల్.. తనూజని డీమాన్ ఫ్లర్ట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ తనతో టాస్క్ ఆడడానికి భరణిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ టాస్క్ లో భరణి ఓడిపోతాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి తొలగిపోతాడు. దాంతో భరణి ఎమోషనల్ అవుతాడు. గౌతమ్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎంత కష్టమైనా ఆడుదామని అనుకున్నాను.. నా కూతురు ఫ్యామిలీ వీక్ లో వచ్చినప్పుడు.. "నాన్న నువ్వు కెప్టెన్ అవ్వాలి" అని అందంటూ భరణి డిసప్పాయింట్ అవుతాడు.

హౌస్ లో ఉన్న తొమ్మిది మందిలో అందరు ఒక్కసారి కెప్టెన్ అయ్యారు. ఇమ్మాన్యుయల్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. భరణి ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు.. పైగా కెప్టెన్సీ టాస్క్ ఇదే చివరి వారం.. నెక్స్ట్ వీక్ నుండి కెప్టెన్సీ టాస్క్ ఉండదు. అందుకే భరణి అంతలా ఎమోషనల్ అవుతున్నాడు. అన్ని టాస్క్ లు అయ్యేసరికి రేస్ నుండి తొలగిపోయిన వారందరికి మళ్ళీ టాస్క్ పెట్టొచ్చు.. ఆ టాస్క్ లో గెలిచిన వారికి కెప్టెన్సీ రేస్ లో పోటీపడేందుకు ఛాన్స్ వస్తుంది కావచ్చు. అందులో భరణి ఉంటాడేమో చూడాలి మరి.