English | Telugu
పల్లవి ప్రశాంత్ కి ’బేబి‘ సినిమా చూపిస్తున్న రతిక!
Updated : Sep 27, 2023
బిగ్ బాస్ హౌజ్ లో బేబీ సినిమా.. అవును నిజమే. రోజు రోజుకి బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ పీక్స్ స్టేజ్ కి వెళ్తున్నాయి. హౌజ్ లోని కంటెస్టెంట్స్ మీద సినిమాల ప్రభావం గట్టిగానే ఉంది. తాజాగా విడుదలైన బేబీ సినిమాని పల్లవి ప్రశాంత్, రతిక, ప్రిన్స్ యావర్ రిక్రీయేట్ చేస్తున్నారు. అదే లవ్ ట్రాక్ తో ప్రేక్షకులకి మంచి కిక్కు ఇస్తున్నారు.
సోమవారం నామినేషన్లలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు తిట్టుకొని, హీటెడ్ ఆర్గుమెంట్ చేసుకొని మంగళవారం నుండి శుక్రవారం వరకు గేమ్, టాస్క్, మధ్య మధ్యలో కబుర్లతో టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే రతిక కంటెంట్ కోసం ఎంతదూరమైన వెళ్తానంటుంది. మొదటి వారం రతికకి పల్లవి ప్రశాంత్ లక్కీ ఛామ్ అనే ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇచ్చాడో అప్పటి నుండి మొదలైంది ఈ కథ. బేబీ సినిమాలో వైష్ణవిని ఆనంద్ ఇష్టపడడ్డుగా.. సరిగ్గా అదే రిపీట్ అవుతుంది. మొదటి నుండి పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపిన రతిక.. మొన్న జరిగిన నామినేషన్లో నీతో నాకేంటి, అసలు ఎవరు నువ్వు అనే డైలాగ్ లతో రెచ్చిపోయింది. ఇక ప్రిన్స్ యావర్ కి మూడవ వారం సపోర్ట్ చేస్తున్నట్టు నటించింది రతిక. అతను టాస్క్ లో తప్పుకున్నాడని తనకి సపోర్ట్ చేస్తున్నట్టు నటించగా, రతికని యావర్ నమ్మాడు. అయితే నమ్మిన కొన్ని గంటల్లోనే సీక్రెట్ రూమ్ లో ఎవరు అనర్హుడని బిగ్ బాస్ చెప్పమంటే యావర్ అని చెప్పింది. ఇక అది బిగ్ బాస్ అందరి ముందు చూపించే సరికి యావర్ మనసు ముక్కలైనంత పని అయింది.
రతికని నమ్మిన ప్రిన్స్ యావర్ ని మోసం చేసింది. ఒకవైపు పల్లవి ప్రశాంత్‌తో, మరోవైపు ప్రిన్స్ యావర్‌తో ప్రేక్షకుల దృష్టి తనవైపు తిప్పుకోవడానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీని క్రియేట్ చేసింది రతిక. నాల్గవ వారం జరిగిన నామినేషన్లో గౌతమ్ కృష్ణని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేసి .. షర్ట్ విప్పి బాడీ చూపించావని అని అన్నాడు. ఇక గౌతమ్ కృష్ణ తనదేమీ తప్పు కాదన్నట్టుగా రతికని ఇన్వాల్వ్ చేశాడు. నన్ను అలా ఎలా అంటావ్? నీకేం రైట్ ఉందని రతిక పల్లవి ప్రశాంత్ తో గొడవకి దిగింది. గొడవ ముగిసే సమయంలో ఇంకోసారి నిన్ను రతిక అంటే నన్ను చెప్పు తీసుకొని కొట్టు అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఇలా పల్లవి ప్రశాంత్ ని ఆడుకున్న రతిక.. ప్రిన్స్ యావర్ ని ఏం చేస్తుందో చూడాలి మరి.