English | Telugu
బుల్లెట్ భాస్కర్ స్కిట్ ....అమ్మాయిలు కుక్కల్లా మీద పడతారంటూ డైలాగ్
Updated : Sep 27, 2023
ఒకప్పుడు జబర్దస్త్ అంటే చాలు హెల్తీ కామెడీతో ఫామిలీ మొత్తం చూసే పరిస్థితి ఉండేది. కానీ తర్వాత్తర్వాత ఆ వ్యవహారం మొత్తం మారిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోయి స్కిట్స్ , నవ్వులు తక్కువైపోయి కుళ్ళు కామెడీ పుట్టుకొచ్చింది. రాను రాను జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా లేడీస్ ని కించపరచడం, అవమానించడం, బాధ పడేలా ఉండే కామెంట్స్ చేయడం అది చూసిన జడ్జెస్ నవ్వేసరికి అదే కామెడీ అనుకునేలా క్రియేట్ చేయడం వంటివి జరుగుతున్నాయి.
రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో బులెట్ భాస్కర్ - గడ్డం నవీన్ స్కిట్ కొంచెం ఎక్స్ట్రా గా ఉంది. ఈ స్కిట్ లో భాస్కర్ హీరోగా చేసాడు. బాడీ స్ప్రే యాడ్ లో నటించాడు. "ఒకప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక్క అమ్మాయి కూడా తిరిగి చూసేది కాదు. ఒక్కసారి ఈ స్ప్రే కొట్టా...కుక్కలు మీద పడినట్టు పడిపోయారు. భాస్కర్ స్ప్రే..నేను వాడాను..మరి మీరు" అని చెప్పిన డైలాగ్ మరీ టూమచ్ గా లేడీస్ ని కుక్కలతో పోల్చడం ఎబ్బెట్టుగా ఉంది.
అంతే కాదు దీనికి కంటిన్యుయేషన్ గా మరో కమెడియన్ వచ్చి "నువ్వు వాడిన స్ప్రే వాడితే అమ్మాయిలు కుక్కల్లా మీద పడతారని అన్నావ్ కదా" అనేసరికి "అమ్మాయిలు కరిచారా" అంటూ భాస్కర్ రివర్స్ లో అడిగాడు. "లేదు కుక్కలు సర్ కుక్కలు కరిచాయి" అనేసరికి జడ్జెస్ తో పాటు యాంకర్ రష్మీ కూడా నవ్వేసింది. ఇక స్టార్టింగ్ లో పటాస్ ప్రవీణ్ స్కిట్ మరీ ఫన్నీగా ఉంది.."జిన్నాబాయ్" గెటప్ లో అదే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చాడు. "వచ్చేటప్పుడు ఆ ఎంట్రీలో ఆ ఫ్లెక్సీ చూసా..అక్కడేంటి అన్ని కుక్కలు ఉన్నాయి" అని ప్రవీణ్ అడిగేసరికి "నీకు అభిషేకం జరుగుతుంది" అని రష్మీ చెప్పిన మాటకు అందరూ నవ్వేశారు.