English | Telugu

గొడవపడిన ఇమ్మానుయేల్-యాదమ్మ రాజు..షాకైపోయిన వర్ష, స్టెల్లా

శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈటీవీ వాళ్ళు ఫస్ట్ టైం ఈ షోలో "ఖుషి కపుల్ కాన్సెప్ట్" పేరుతో ఒక సెగ్మెంట్ ఇచ్చారు. అందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏ జోడి ఇస్తుందో వాళ్లకు 5 లక్ష కాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేశారు. ఏక్నాథ్ - హారిక, రోహిత్ - మెరీనా, ఇమ్మానుయేల్ - వర్ష, ప్రీతి నిగమ్- నగేష్, స్టెల్లా- యాదమ్మ రాజు, అరియనా- పండు జోడీలు ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పాత సీరియల్స్ లో ఎక్కువగా పోలీస్ గెటప్స్ లో నటించిన సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏక్నాథ్ హారిక కోసం "జాబిలమ్మ నీకు అంత" అనే సాంగ్ ని పాడాడు.

ఆ తర్వాత వర్ష కోసం ఇమ్మానుయేల్ వెంకటేష్ సాంగ్ ఒకటి పాడి వినిపించాడు. పండు-ఆరియానా చేసిన రొమాంటిక్ డాన్స్ "పచ్చదనమే " సాంగ్ అందరికి నచ్చేసింది. దాంతో మెరీనా కామెంట్ కూడా ఇచ్చింది "మీరిద్దరూ చాలా క్యూట్ గా అనిపించారు డాన్స్ చేసేటప్పుడు" అని చెప్పింది. తర్వాత స్టెల్లా-యాదమ్మ రాజు జోడి కలిసి "హోయ్ రాజు కన్నుల్లో నువ్వే" సాంగ్ కి డాన్స్ చేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ తర్వాత ఇమ్మానుయేల్ కామెంట్ చేసాడు "సారీ మీ డాన్స్ నాకు నచ్చలేదు" అని చెప్పాడు. "ఇమ్మానుయేల్ నీకు నచ్చినా నచ్చకపోయినా 100 కి 1 మార్క్ అన్నా ఇవ్వాలి" అని చెప్పింది స్టెల్లా. తర్వాత యాదమ్మ రాజుకు, ఇమ్మానుయేల్ కి బాగా గొడవ జరిగింది. యాదమ్మ రాజు స్టెల్లాని తీసుకుని స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు. ఇమ్మానుయేల్ తన జాకెట్ ని స్టేజి మీద విసిరిగొట్టి వెళ్లిపోయేసరికి వర్షా షాకై చూస్తూ ఉండిపోయింది. ఇంతకు వాళ్ళ మధ్య జరిగిన గొడవ ఏమిటి...ఏ జోడి క్యాష్ ప్రైజ్ ని గెలుచుకుంది అనే విషయం తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాలి. ఇక నెటిజన్స్ ఇదంతా షోలో స్టంట్ కోసమే కానీ వాళ్ళ మధ్య గొడవలాంటివేమీ ఉండవు అని కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.