English | Telugu
Ayesha out from Bigg Boss season 9: బిగ్ బాస్ సీజన్-9 నుండి అయేషా అవుట్.. అసలేం జరిగిందంటే!
Updated : Oct 23, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందు ఒకలెక్క.. వచ్చాక ఒక లెక్క అన్నట్టుగా మారింది. ఆయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాకముందు నుండే ఫుల్ హైప్ తీసుకొచ్చిన కంటెస్టెంట్ అయేషా. తను తమిళ బిగ్ బాస్ లో చిచ్చరపిడుగులా ఆడి వైరల్ అయింది. అక్కడ హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ పైనే కోప్పడిన అయేషా.. మోస్ట్ వైరల్ కంటెస్టెంట్ గా నిలిచింది.
రమ్య మోక్ష, నిఖిల్, గౌరవ్, దివ్వెల మాధురి, అయేషా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో అయేషా మోస్ట్ వైల్డ్ కంటెస్టెంట్ గా నిలిచింది. అయితే తను హౌస్ లో సోమవారం జరిగిన నామినేషన్లలో రీతూని నామినేట్ చేసి గట్టిగా ఆర్గుమెంట్స్ చేసింది. అయితే నిన్నటి వరకు జరిగిన దొంగల టాస్క్ లో ఇమ్మాన్యుయల్ ని బ్లూ టీమ్ లోకి తీసుకొచ్చింది అయేషా.. అయితే అది మొన్న లైవ్ లో జరిగింది. కానీ నిన్న తనకి సడెన్ గా హెల్త్ ఇష్యూ వచ్చిందని మెడికల్ రూమ్ కి వెళ్లిందంట. కానీ తనకి హెల్త్ అంతగా సహకరించట్లేదని తను మళ్ళీ హౌస్ లోకి రావడం కష్టమే అని తెలుస్తోంది.
ఆయేషా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి రెండు వారాలు కూడా కాలేదు కానీ తనకి ఫుల్ హైప్ ఉంది. తన మాటకి ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఆర్గుమెంట్స్ చేస్తుంది. నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయేషా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా హౌస్ నుండి బయటకు వెళ్లిపోయింది. మొదటగా చిన్న అస్వస్థతగా భావించిన, పరిస్థితి కాస్త సీరియస్ కావడంతో బిగ్ బాస్ టీమ్ తక్షణ చర్య తీసుకుంది. వైద్యుల సలహా మేరకు ఆమెను హౌస్ నుండి బయటకు పంపించి చికిత్సకు తీసుకెళ్లినట్లు సమాచారం. లైవ్ ఎపిసోడ్ లో తనతో పాటు వచ్చిన కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. అయేషా మళ్లీ హౌస్ లోకి వస్తుందా రాదా అనే డౌట్ ఇప్పుడు అందరిలో నెలకొంది.