English | Telugu
సుధీర్ ఛానెల్స్ మారే విషయాన్ని పిట్ట కథగా చెప్పిన రాంప్రసాద్!
Updated : Nov 18, 2022
ఈ వారం "ఎక్స్ట్రా జబర్దస్త్" ఫుల్ ఎంటర్టైన్ చేసింది. సుడిగాలి సుధీర్ ఎంట్రీతో గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ లో మంచి జోష్ వచ్చింది. ఇక వీళ్ళ టీమ్ పెర్ఫార్మ్ చేసిన స్కిట్ ఫుల్ కామెడీగా ఉంది.ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనలను స్కిట్ రూపంలో చేసి చూపించారు. సుధీర్ హీరోగా రాంప్రసాద్ డైరెక్టర్ గా చేశారు.
సుధీర్ సినిమా మొత్తం చేసాక క్లైమాక్స్ కి వచ్చేసరికి మూవీ ఆపేశామని రాంప్రసాద్ చెప్పడంతో షాకయ్యాడు. "ఎందుకు మూవీ ఆపేశారని" అడిగేసరికి "ప్రొడ్యూసర్ మిమ్మల్ని దూరం నుంచి చూసాడు మీ యాక్షన్ నచ్చలేదట అందుకే మూవీ ఆపేయమన్నారు" అని చెప్పాడు. దీన్ని బట్టి నీకేం తెలుస్తోంది.. రా ఒక పిట్ట కథ చెప్తా అని రాజు, ఏడు చేపల కథ చెప్పాడు..అందులో సారాంశాన్ని సుధీర్ కామెడీ యాంగిల్ లో అర్ధం చేసుకోవడంతో ఆటో రాంప్రసాద్ మరో కథ చెప్పాడు. "అడవిలో మూడు కోతులు ఉండేవి..అందులో ఒక కోతి సిటీకి వెళ్లి తిరిగి తిరిగి మళ్ళీ అడవికే వచ్చింది. దీన్ని బట్టి నీకేం అర్ధమవుతోంది" అని అడిగేసరికి "కోతులు అడవిలోనే ఉండాలి...సిటీకి వెళ్ళకూడదు"..అని ఫన్నీగా చెప్పేసరికి కోపం వచ్చిన రష్మీ సుధీర్ ని వదిలేసి వెళ్ళిపోయింది.