English | Telugu
కొత్త తెలుగు యాంకర్ గా అవతారమెత్తిన శోభా శెట్టి..
Updated : Jan 11, 2024
కార్తీకదీపం సీరియల్ లో హీరో, హీరోయిన్ కి ఎంత పేరొచ్చిందో లేడీ విలన్ గా మోనిత అలియాస్ శోభా శెట్టికి కూడా అంతే పేరొచ్చింది. ఆ నేమ్ అండ్ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చింది శోభా.. మిగతా హౌస్ మేట్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక తన ఫాన్స్ కి చాలా శుభవార్తలు చెప్పింది.
ఒక ఇల్లు కొనుక్కుంది..అలాగే తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి కూడా త్వరలోనే చేసుకోబోతోంది..వీటి గురించి ఆల్రెడీ వీడియోస్ కూడా చేసింది. ఇక ఇప్పుడు మరో శుభవార్త కూడా చెప్పింది. అదే తాను యాంకర్ అయ్యానని ఆనందం వ్యక్తం చేసింది . సీరియల్స్ లో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలను అంటూ అభిమానులు చెప్పారు. ఆ సపోర్ట్ తో, ఆ ప్రేమతో ఇప్పుడు ఫస్ట్ టైం యాంకరింగ్ కూడా చేయబోతున్నానంది. అలాగే రెండు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తయ్యాయంది మోనిత పాపా. "బిగ్ బాస్ తర్వాత ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం కన్నడలో ఆల్రెడీ ఒక కుకింగ్ షోకి యాంకరింగ్ చేసాను.. కానీ తెలుగులో మాత్రం ఇదే ఫస్ట్ టైం. తెలుగులో యాంకరింగ్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే తెలుగు మీద ఇంకా గ్రిప్ రాలేదు కాబట్టి ఫ్లూయెంట్ గా నేర్చుకుంటున్నా" అని చెప్పింది శోభా శెట్టి. ఇక ఇప్పుడు "నేను కూడా యాంకరింగ్ చేయగలను అని తెలుసుకుని సుమన్ టీవీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. ఆ షో పేరు "కాఫీ విత్ శోభా'. ఎప్పుడూ నేను ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ ఐనా తమను తాము ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు. ఇక ఈ షోకి ప్రోమో ఎలాంటి ప్రామ్ప్టింగ్ లేకుండా చెప్పాను..మీరంతా ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి..మూడు ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పాను..ఇది ఫస్ట్ ప్రాజెక్ట్" అంటూ శోభా శెట్టి తన లేటెస్ట్ అప్ డేట్ ని సోషల్ మీడియాలో ఫాన్స్ తో షేర్ చేసుకుంది.