English | Telugu

అషురెడ్డి హ్యాండ్ బ్యాగ్‌ను కోపంతో విసిరికొట్టిన‌ వాళ్ల‌మ్మ‌.. వీడియో వైరల్!

బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్ గా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతోంది. 'హ్యాపీ డేస్', 'కామెడీ స్టార్స్' లాంటి షోలలో ఆమె చేసే సందడికి అందరూ ఫిదా అవుతున్నాయి. తెరపై ఎంతో చలాకీగా కనిపించే అషురెడ్డి రియల్ లైఫ్‌లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటుంది.

ఈ మధ్యకాలంలో రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపిస్తుందంటూ ఆమెకి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఓ హ్యాండ్ బ్యాగ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఇందులో అషురెడ్డి ఓ హ్యాండ్ బ్యాగ్‌ను తన తల్లికి చూపించి.. లక్షన్నర పెట్టి కొన్నట్లు చెప్పింది. "నిజం చెప్పు" అంటూ ఆ హ్యాండ్ బ్యాగ్‌ను చూసుకుంటూ అషురెడ్డి వాళ్ల‌మ్మ‌ ప్రశ్నించింది. "నిజమే మ‌మ్మీ" అని అషురెడ్డి చెప్పింది.

వెంటనే వాళ్ల‌మ్మ‌ హ్యాండ్ బ్యాగ్‌ను నేలకేసి కొట్టింది. "ఇంట్లో ఉన్నవి సరిపోవా..? అయ్య‌న్నీ ఎందుకు? పైనేసి తగలబెట్టుకుంటావేటి..?" అంటూ అషురెడ్డిపై ఫైర్ అయింది. దాంతో అషు న‌వ్వు ఆపుకోలేక‌పోయింది. ఈ వీడియో షేర్ చేసిన అషురెడ్డి ఈ బ్యాగ్ తనకు గిఫ్ట్‌గా వచ్చిందంటూ అసలు విషయం చెప్పింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...