English | Telugu

''బాటిల్ మొత్తం తాగాక ఒంటరిగా ఫీల్ అవుతానేమో"!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన తల్లితో కలిసి ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. రీసెంట్ గా ఈ తల్లీకూతుళ్లు చీరలు కట్టుకొని చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో సుప్రీత ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంతే రేంజ్‌లో ట్రోలింగ్‌కి గురవుతుంటుంది.

ట్రోలర్స్‌పై ఆమె మండిపడే తీరు కూడా వివాదాలకు దారి తీస్తుంటుంది. రీసెంట్ గానే సుప్రీత లైవ్‌లో ఓ నెటిజన్‌కు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా సుప్రీత మరోసారి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. తన గురించి ఎవరేం అనుకుంటున్నారో చెప్పమని సుప్రీత ఓ పోస్ట్ పెట్టింది. దానికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు .

కొందరు సుప్రీత వ్యక్తిత్వం మీద ప్రశ్నలు అడిగితే.. మరికొందరు మాత్రం పర్సనల్ విషయాల మీదే దృష్టి పెట్టారు. ఓ నెటిజన్ మాత్రం సుప్రీతను తాగుడు అలవాటు ఉందా..? అని నేరుగా అడిగాడు. "మీరు ఓ సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా..?" అని సుప్రీతను అడగగా.. దానికి ఆమె. ''బహుశా మొత్తం బాటిల్ తాగాక అలా ఒంటరిగా ఫీల్ అవుతానేమో'' అని చెప్పుకొచ్చింది. వైన్ గ్లాస్‌ను కూడా ఆమె షేర్ చేసింది. మొత్తానికి తనకు వైన్ తాగే అలవాటు ఉందని.. సుప్రీత నేరుగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...