English | Telugu

విజ‌య్ 'బీస్ట్‌'కు ప‌నిచేస్తున్న‌ జానీ మాస్టర్!

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోని అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌పై చిత్రీక‌రించిన‌ "బుట్ట బొమ్మ" పాటతో జానీ మాస్టర్ మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయనకు కోలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా జానీ మాస్టర్‌కు దళపతి విజయ్ సినిమాకి పని చేసే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'బీస్ట్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కాసేపటికే సెకండ్ లుక్ అంటూ మరో పోస్టర్ వదిలి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ఈ పోస్టర్స్ ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి విజయ్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు జానీ మాస్టర్.

"మీతో కలిసి పని చేస్తున్నందుకు నేను ఎంతో లక్కీ.. ఇంకా మీతో మరెన్నో సినిమాలు చేయాలని అనుకుంటున్నాను." అంటూ రాసుకొచ్చారు జానీ మాస్టర్. అంతేకాదు.. దర్శకుడితో కలిసి తీసుకున్న ఫోటోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్ చెప్పారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...