English | Telugu

కాలికి బెల్టుతో..చేతిలో స్టిక్ తో వరుణ్ సందేశ్...


హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్ మూవీ షూటింగ్ లో గాయపడ్డాడు. "ది కానిస్టేబుల్" అనే మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తన కాలికి గాయమయ్యింది. కాలు కొంచెం బెటర్ అవ్వాలంటే త్రి వీక్స్ రెస్ట్ ఇవ్వాలని చెప్పడంతో ఇంట్లోనే కాలికి బెల్ట్ వేసుకుని స్టిక్ తో నడుస్తూ కనిపించాడు. ఈ విషయాన్నీ వితిక షేరు వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది "వరుణ్ సందేశ్ బాగున్నారు. తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ లో కాలికి గాయమయ్యింది. అతనికి మూడు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు...మీరంతా ఆయన మీద చూపిస్తున్న ప్రేమకు.. కోలుకోవాలంటూ చెప్తున్న విషెస్ కి థాంక్యూ" అని చెప్పింది. వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘ఢీ’ షోలో ఒక టీమ్‌కు లీడర్ గా ఉన్నారు. 'హ్యాపీ డేస్' మూవీతో ఒక మంచి బబ్లీ బాయ్ గా ఆడియన్స్ లో ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.

తర్వాత 'కొత్త బంగారు లోకం', 'ఏమైంది ఈవేళ', 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' వంటి మూవీస్ లో నటించారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మైఖేల్' మూవీలో వరుణ్ సందేశ్ ఒక డిఫరెంట్ రోల్ చేశారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం 'ది కానిస్టేబుల్', 'చిత్రం చూడర' అనే మూవీస్ లో చేస్తున్నారు. అతను చేసే మూవీస్ ఆశించిన ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు. రీసెంట్ గా చేసిన ‘ఇందువ‌ద‌న’ అనే హార‌ర్ కామెడీతో వ‌చ్చినా పెద్దగా లాభం లేకపోయింది. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం తర్వాత మంచి బ్రేక్ రాకపోవడంతో సైలెంట్ గా ఉన్న వరుణ్ ఇప్పుడు ఈ రెండు సినిమాల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. వ‌రుణ్ సందేశ్ న‌టిస్తున్న ‘ది కానిస్టేబుల్’ మూవీని ఆర్యన్ శుభాన్ డైరెక్ట్ చేస్తున్నారు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది.


Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.