English | Telugu
ఆర్య తల్లి ఎందుకు భయపడుతోంది.. అనుకి ప్రమాదమా?
Updated : Apr 11, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొంత కాలంగా జీ తెలుగులో ఈ సీరియల్ విజయవంతంగా ప్రసారం అవుతోంది. మరాఠీ సీరియల్ `తులా ఫఠేరే` ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్ (సిద్ధార్ధ్ కి సోదరుడిగా కనిపించారు), వర్ష హెచ్ కె ప్రధాన జంటగా నటించగా కీలక పాత్రల్లో జయలలిత, రామ్ జగన్, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, అనూషా సంతోష్, జ్యోతి రెడ్డి, వర్ష తదితరులు నటించారు.
ఆర్య - అనుల శోభనం .. సుబ్బు, సద్దుల ఇంటిలో ఏర్పాటు చేయడంతో దాన్ని ఎలాగైనా ఆపాలని మాన్సీ ఆమె తల్లి ప్లాన్ చేస్తారు. అదే సమయంలో ఆర్యని హత్య చేయాలని రాగసుధ శోభనం గదిలోని ఫ్యాన్ ఊడిపడేలా ప్లాన్ చేస్తుంది. మాన్సీ ఆత్మ హత్య చేసుకుంటానని కాల్ చేయడంతో అను - ఆర్య వెంటనే శోభనం గది నుంచి బయటికి వస్తారు. అదే సమయంలో ఫ్యాన్ ఊడి బెడ్ పై పడిపోతుంది. ఆ వెంటనే ఆర్య - అను తో పాటు అంతా ఇంటికి వెళతారు.
మాన్సీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తోందని నీరజ్ కు చెప్పి ఆమె గదికి వెళ్లి తలుపులు తీస్తారు. కట్ చేస్తే మాన్సీ, ఆమె తల్లి హ్యాపీగా బిర్యానీ తింటూ కనిపిస్తారు. అదేంటీ ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ చేశావ్ అని మాన్సీని అడిగితే అది ప్రాంక్ కాల్ అని, తను ఆత్మ హత్య చేసుకోవడం ఏంటని సిల్లీగా నవ్వుతుంది మాన్సీ అతి తట్టుకోలేని ఆర్యకు చిర్రెత్తుకొచ్చి అరిచేస్తాడు. మాన్సీకి, ఆమె తల్లికి ఇది మరోసారి రిపీట్ కావద్దని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో జెండే కలగజేసుకుని నేను చూసుకుంటానంటాడు. ఆర్య వెళ్లగానే మాన్సీకి, ఆమె తల్లికి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఈ సారి మీరు కోరుకున్నది నిజమవుతుందని షాకిచ్చి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే ఆర్య తల్లి నిర్మలా దేవి పంచాంగం చూస్తూ వుంటుంది. ఇంతలో అను ఆఫీస్ కి బయలుదేరాలని అటుగా వస్తుంది. అనుని గమనించిన నిర్మలా దేవి ఈ రోజు ఆఫీస్ కి వెళ్లకూడదని, నీకు ప్రమాదం పొంచి వుందని చెబుతుంది. ఇంతకీ అనుకు రాబోయే ప్రమాదం ఏంటీ? .. నిర్మలాదేవి ఊహలో అనుకి ప్రమాదం తలపెట్టే వ్యక్తి ఎవరు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.