English | Telugu
బిగ్‌బాస్ నాన్ స్టాప్ ట్విస్ట్.. స్రవంతి, ముమైత్ ఇద్దరూ ఔట్!
Updated : Apr 11, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ మొత్తానికి కిందా మీదా పడుతూ మిడిల్ కి చేరింది. కాంట్రివర్సీలు.. గొడవలు.. తిట్లు.. కుల ప్రస్తావన వంటి ప్రహసనాలతో మొత్తానికి సగం జర్నీని పూర్తి చేసుకుంది. ఆదివారం వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చేశారు. ఎప్పటిలాగే హౌస్ మేట్స్ తో వారం రోజుల్లో జరిగిన దానిపై రివ్యూ నిర్వహించడంతో పాటు కంటెస్టెంట్ లతో గేమ్స్ ఆడించారు. ఇక ఆటపాటలతో కంటెస్టెంట్స్ ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఎలిమినేషన్ కి సంబంధించిన టెన్షన్ ని క్రియేట్ చేశారు. అయితే అనూహ్యంగా ఇద్దరిని ఎలిమినేట్ చేసేశారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన వారిని హౌస్ నుంచి బయటికి పంపించేశారు.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ఎలిమినేషన్ రౌండ్ లో చివరికి ముగ్గురు మిగిలారు. ముమైత్ ఖాన్, స్రవంతి, మిత్రలను నాగార్జున కొంత సేపు టెన్షన్ పెట్టారు. ఆ తరువాత వారి ఎదురుగా వున్న బాక్సుల్లో చేతులు పెట్టమన్నారు. అనంతరం కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. చేతుల్లో రెడ్ కలర్ వున్న వారు ఎలిమినేట్ అయిపోతే.. గ్రీన్ కలర్ వున్న వారు సేఫ్ అవుతారు. అయితే ఈ టాస్క్ లో అనూహ్యంగా ముమైత్, స్రవంతి చేతులకు రెడ్ కలర్ రాగా, మిత్ర చేతికి మాత్రం గ్రీన్ కలర్ కనిపించడంతో ఒక్కసారిగా కంటెస్టెంట్స్ షాకయ్యారు. ఇదేంటీ ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్ కావడం ఏంటని ఆశ్చర్యానికి లోనయ్యారు.
అనంతరం ముమైత్, స్రవంతిలు ఎలిమినేట్ అయినట్టుగా నాగార్జున ప్రకటించారు. మొదటి వారం ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ కు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చి రెండవ సారి హౌస్ లోకి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రెండవ సారి కూడా ముమైత్ హౌస్ నుంచి వెళ్లిపోవడం ఇప్పడు ఆమెకు భారీ షాక్ అంటున్నారు. అయితే స్రవంతి మాత్రం చాలా ఎమోషనల్ అయింది. తాను ఎలిమినేట్ అయ్యానని తెలియగానే భోరున ఏడ్చేసింది. వెళుతూ వెళుతూ స్రవంతి .. నటరాజ్ మాస్టర్ కు మాత్రం గట్టి షాక్ ఇవ్వడం విశేషం. అఖిల్, బిందు మాధవి, అషురెడ్డి తనకు ఇష్టమైన కంటెస్టెంట్స్ అని చెప్పిన స్రవంతి .. నటరాజ్ మాస్టర్ పై మాత్రం అనూహ్యమైన కామెంట్స్ చేసి అతన్ని షాక్ కు గురిచేసింది.