English | Telugu
బిగ్ బాస్ నుండి బయటకొచ్చేసిన అర్జున్!
Updated : Oct 24, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఎన్నడు లేని విధంగా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. కాగా ప్రేక్షకులకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలో అనే ఆలోచనలో పడేలా చేసింది. కాగా సండే ఎపిసోడ్ లో, ఓ వైపు ఎంటర్టైన్మెంట్ చేస్తు మరో వైపు అందరిలో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేస్తు రాగా చివరగా వాసంతి అర్జున్ లు ఉన్నారు. "మీ ముందు ఇద్దరి పేర్లతో ఫ్లవర్ పాట్ లు ఉన్నాయి, అందులో ఏది వెలుగుతుందో వాళ్ళు సేవ్ అవుతారు. వెలగని వాళ్ళు ఎలిమినేట్ అవుతారు" అని చెప్పాడు నాగార్జున. అందులో అర్జున్ పాట్ వెలగకపోవడంతో , "అర్జున్ యూ ఆర్ ఎలిమినేటెడ్" అని చెప్పేసాడు నాగార్జున. దాంతో అర్జున్ ఎలిమినేట్ అయి బయటకొచ్చేసాడు.
ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు భావోద్వేగానికి లోనయ్యారు. మొదటిసారిగా శ్రీసత్య, అర్జున్ కోసం ఏడ్చింది. అది చూసి హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యపోగా, అర్జున్ వెళ్ళిపోతాడని బాధలో ఉన్నారు. ఆ తర్వాత అందరికి బై చెప్పేసి హౌస్ నుండి నాగార్జున దగ్గరకు వచ్చేసాడు.
నాగార్జున, అర్జున్ తో కాసేపు మాట్లాడాడు. తర్వాత తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. హౌస్ మేట్స్ గురించి చెప్పమని ఒక టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో "తుస్ బాంబులా ఎవరుంటారు? ఆటంబాంబులా ఎవరుంటారు?" అని చెప్పమన్నాడు. "శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, గీతు, ఫైమా వీళ్ళు ఆటంబాంబులు గా ఉంటారు. రోహిత్, మెరీనా, కీర్తి భట్, ఇనయా, ఆదిత్య వీళ్ళు తుస్ బాంబులా ఉంటారు" అని అర్జున్ చెప్పాడు. అర్జున్ వెళ్లిపోతు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. "బిగ్ బాస్ కి శ్రీసత్య వల్లే వచ్చాను. ఏదో మూవీ షూటింగ్ కి శ్రీసత్య ని డేట్స్ అడిగితే లేవు అంది. ఎందుకని అడిగితే నేను బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యాను అంది. అందుకే నేను కూడా బిగ్ బాస్ కి అప్లై చేసుకున్నా, సెలెక్ట్ అయ్యాను" అని చెప్పడం తో అందరు ఆశ్చర్యపోయారు. ఇక టైం అయింది అని అర్జున్ ని నాగార్జున పంపించేసాడు.
అయితే ఆడియన్స్ వేస్తోన్న ఓటింగ్ లో చివరి స్థానంలో లేని అర్జున్ ఎలిమినేషన్ పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. ఇది చాలా అన్ ఫెయిర్ అంటు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తోన్నారు.