English | Telugu
నీది, నాది ఎన్నో జన్మల పగరా సోహైల్ అన్న ఆరియానా
Updated : Feb 1, 2024
బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ సోహైల్ ఇప్పుడు వరసపెట్టి మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. బూట్ కట్ బాలరాజు మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి మూవీస్ లో నటించాడు. కోనేటి శ్రీను డైరెక్షన్ లో బూట్ కట్ బాలరాజు వచ్చింది. అలా ఒక ఇంటర్వ్యూలో ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లోకెల్లా తనకు ఇష్టమైనది ఆరియానా అని ఒక కామెంట్ చేసాడు. ఇక ఆ లైన్ పట్టుకుని ఇప్పుడు ఆరియానా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.
"సోహైల్ అసలు నిజంగా చెప్పాలంటే నాకు నువ్వంటే చాలా కోపం రా. నువ్వంటే నాకు అస్సలు పడదు. బట్ నువ్వు మాత్రం చాలా క్యూట్ గా ఆరియానా చాలా మంచిది, ఎన్ని కష్టాలు వచ్చినా మాట్లాడుతుందని అని నన్ను అక్కడ ఇంప్రెస్ చేసేస్తూ ఉంటావ్. అప్పుడనిపిస్తుంది వీడెంత మంచోడో నా పేరు చెప్పాడు అని. కానీ నీ మీద నాకు కోపం మాత్రం తీరడం లేదు. ఎన్నో జన్మల పగ అనుకుంటా రా. ఏదేమైనా నీ మూవీకి హార్టీ కంగ్రాట్యులేషన్స్. ఈ మూవీ కోసం నా ఫ్రెండ్ సోహైల్ చాలా కష్టపడ్డాడు. ఈ మూవీని అందరూ సపోర్ట్ చేయండి. ఈ మూవీ హిట్ కొట్టాలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నా. సక్సెస్ అయ్యి నీకు డబ్బులు రావాలని అది నీ కెరీర్ కి ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఐనా నువ్వు ఏజ్ ఐపోతున్నా వయసు కనపడకుండా మెయింటైన్ చేస్తున్నావ్ కదా ఇలాగే మానేజ్ చేస్తూ 80 , 90 సినిమాలు చేయాలని కోరుకుంటున్నా" అని చెప్పింది.