English | Telugu
విద్యాబాలనా...మంగ్లీనా ?
Updated : Feb 1, 2024
మాస్ సింగర్ మంగ్లీకి పరిచయం అవసరం లేదు. జానపద పాటలకు కేరాఫ్ అడ్రస్..ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ కి ట్రెండ్ సెట్టర్ కూడా. ఈమె పాటలకు ప్రజాదరణ మాములుగా ఉండదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో పాటలు పాడేస్తుంది. ఒక్కో అడుగు ముందుకేస్తూ మూవీస్ లో కూడా నటించే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు స్టార్ సింగర్ గా, జడ్జ్ గా సెటిల్ అయ్యింది. సింగర్ మంగ్లీ కి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడలో ఎన్నో అద్భుతమైన పాటలతో అక్కడి వారిని కూడా అలరించింది.
అలాంటి మంగ్లీ ఎప్పుడూ ట్రెడిషనల్ వేర్ లో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మంచి ట్రెండింగ్ వేర్ లో కనిపిస్తూ ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తోంది. ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఐతే ఒక నెటిజన్ మాత్రం ఒక వెరైటీ కామెంట్ చేశారు. "ఒక్కసారిగా ఈ లుక్ లో చూసేసరికి విద్యా బాలన్ అనుకున్నా. విద్యాబాలన్ కంటే మీరేమీ తక్కువ కారు. హ్యాట్సాఫ్ టు యు నైటింగేల్ " అంటూ కామెంట్ పెట్టారు. ఇంకొంతమంది కూడా అవే కామెంట్స్ పెట్టారు. మంగ్లీ ప్రతీ పండగకు పాటలు రాసి ట్యూన్ చేసి వాటిని వీడియో చేసి తన సొంత యుట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తుంది. ప్రస్తుతం సూపర్ సింగర్ షోకి రాహుల్ సిప్లిగంజ్ తో పాటు వనాఫ్ ది జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈమెను ఏపీ ప్రభుత్వం ఎస్వీబీసీ సలహాదారుగా నియమించింది. యూట్యూబ్ లో ఆమె సాంగ్ రిలీజ్ ఐతే చాలు.. కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ అందుకుంటాయి. 'ధమాకా'లోని 'జింతాక్కా', 'అల వైకుంఠపురములో'ని 'రాములో రాములా', 'జార్జ్ రెడ్డి' లో 'వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్', 'శైలజా రెడ్డి అల్లుడు చూడే' వంటి సాంగ్స్ లో ఆమె వాయిస్ బాగా ఎలివేట్ అయ్యి ఆమెకు మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చాయి. 'స్వేచ్ఛ', 'గువ్వ గోరింక', 'మాస్ట్రో' వంటి మూవీస్ సైడ్ రోల్స్ చేసి మంచి నటి గానూ పేరు తెచ్చుకుంది.