English | Telugu
'బిగ్ బాస్ ఉత్సవం'లో సీమంతం.. హరితేజ భావోద్వేగం!
Updated : Feb 15, 2021
బుల్లితెర యాంకర్, నటి హరితేజ భావోద్వేగానికి లోనయ్యారు. నటిగా 'అఆ', 'ప్రతిరోజు పండగే' వంటి చిత్రాలతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హరితేజ బిగ్‌బాస్ సీజన్ 3తో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవల ప్రెగ్నెంట్ అయిన ఆమెకు బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ ప్రత్యేకంగా సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రీ యూనియన్ అంటూ 'బిగ్‌బాస్ ఉత్సవం' పేరుతో స్టార్ మా ప్రత్యేకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేసి ప్రసారం చేస్తోంది. ముందుగా బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌లతో ఈ షోని ప్రారంభించిన స్టార్ మా దానికి కొనసాగింపుగా 'బిగ్‌బాస్ ఉత్సవం 2' అంటూ ఇటీవల మరో ఎపిసోడ్ ని ప్రసారం చేసింది.
ఇందులో బిగ్‌బాస్ సీజన్ 3కి సంబంధించిన కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. ఆడిపాడి హంగామా చేశారు. అయితే ఇదే షోలో హరితేజ కూడా పాల్గొంది. ఆమె గర్భవతి కావడంతో ఇదే స్టేజ్‌పై బిగ్‌బాస్ సీజన్ 3కి సంబంధించిన కంటెస్టెంట్‌లు హరితేజకు సీమంతం చేయడం ఆకట్టుకుంది. తను ఊహించని స్థాయిలో తనకు సీమంతం జరగడంతో ఒక్కసారిగా హరితేజ భావోద్వేగానికి లోనయింది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది.