English | Telugu

'రేవంత్..నువ్వు నీ లైన్ క్రాస్ చేసావ్', అర్జున్!

నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ హౌస్ నామినేషన్లో మాత్రమే మాటల యుద్ధం జరుగుతుంది అని అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా హీటెడ్ అర్గుమెంట్ జరిగింది. అయితే టాస్క్ లో భాగంగా సినిమా పోస్టర్లు ఎవరు ఎక్కువ అతికిస్తే వాళ్ళు ఈ లెవల్ లో గెలుస్తారు అని బిగ్ బాస్ చెప్పగా, టాస్క్ ముగిసాక సంచాలకులురాలిగా చేస్తోన్న ఇనయా తను రిజల్ట్స్ గురించి చెప్తుండగా, రేవంత్ అలా కాదు, మాది రైట్ అని ఆర్గుమెంట్ చేస్తుండగా అర్జున్ ని రేవంత్ ఒక మాట అన్నాడు. ఈ మాట అర్జున్ చెవిన పడలేదు. దీంతో శ్రీసత్య, అర్జున్ తో "నువ్వు మనిషివి కదా, ఏం ఫిలింగ్స్ లేవా" అని అనగానే, అర్జున్ రేవంత్ తో గొడవకు వెళ్ళాడు. "అరెయ్ అసలు ఎవరికి వాల్యూ ఇవ్వవా, హౌస్ లో అందరిని ఇష్టం ఉన్నట్లు పిలుస్తావ్. ఏం అన్నావ్ రా", అని అనగా "ఎవరో వచ్చింది చెపితే అనడం కాదు. నువ్వు సొంతగా ఆలోచించి మాట్లాడితే బెటర్. ఇన్ని రోజులు లేనిది ఎవరో వచ్చి చెప్తే నువ్వు మాట్లాడుతున్నావ్. ఇది మొదటి వారం నుండి ఉంటే బాగుండు. But I am Happy ఇప్పటికైనా మాట్లాడుతున్నావ్" అని చెప్పాడు రేవంత్‌.

ఆ తర్వాత అర్జున్, రేవంత్ తో "ఇకముందు నా లిమిట్స్ లో నేను ఉంటాను, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. అంతేకానీ ఎక్కవ మాట్లాడకు. నువ్వు నీ లైన్ క్రాస్ చేస్తున్నావ్. చూసుకో, చాలా బాగోదు" అని అనగా, "సర్లే పోరా బాబు" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత అర్జున్, రేవంత్ తో గొడవకు దిగాడు. అర్జున్, రేవంత్ దగ్గరికి వచ్చి "సారీ రా సడన్ గా అనేసాను అంటే ఆ టాపిక్ క్లోజ్ అయిపోయేది కదరా " అని అర్జున్ అనగా "చాలు రా బాబు" అంటు కోపంగా మాట్లాడాడు. ఈ ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ రావడానికి మాత్రం శ్రీసత్యనే కారణం అని చెప్పాలి. ఎందుకంటే అర్జున్ ని ప్రొవొక్ చేయడంతో, అర్జున్ కి కోపమొచ్చి రేవంత్ తో గొడవకి దిగాడు.

కాని అర్జున్ హౌస్ లో ఇన్ని రోజులుగా ఒక్కసారి అయిన వాయిస్ ఎక్కువ చేసి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ శ్రీసత్య చెప్పడంతో ఒక్కసారి ఆర్గుమెంట్ కి దిగాడు. ఈ గొడవ నామినేషన్ వరకు ఉంటుందో లేదా మళ్ళీ మాములు అయి కలిసిపోతారో లేదో చుడాలి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..