English | Telugu

'ఆర్జే సూర్య నవ్వు వెనుక చాలా బాధే ఉంది..!'

బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తోన్న సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతని పూర్తి పేరు సూర్య నారాయణ. ఇతను తూర్పు గోదావరి జిల్లా పసువులంకలో సత్యనారాయణ, సరస్వతమ్మ దంపతులకు జన్మించాడు. తల్లి తండ్రులు కూలి పని చేస్తూ ఉన్నారు. సూర్య బాల్యంలో ఒక్క రోజు కూడా సరైన తిండి తినట్లేదంట. చిన్నతనం నుండి చదువుకుంటూనే ఒక కిల్లీకొట్టు లో సోడాసీసాలు కడిగేవాడంట. అది కూడా రోజంతా పనిచేస్తే పది రూపాయలు వచ్చేయంట. బాల్యం నుండి చాలా కష్టాలు అనుభవించాడట. ఇతను భీమవరంలో బి.కాం చేస్తూ, రాజమండ్రి లో పీజీ పూర్తి చేసాడట. సూర్యకి మిమిక్రీ అంటే ఇష్టం. తనలో తానే ప్రముఖ నటుల వాయిస్ లను ప్రాక్టీస్ చేసేవాడట. అయితే సూర్య తనలో తానే అలా మాట్లాడడం చూసి బయపడి వాళ్ళ అమ్మ హాస్పిటల్ కి తీసుకెళ్లిందట. అ డాక్టర్ సూర్య ని చూసి 'మీ అబ్బాయిలో మంచి టాలెంట్ ఉంది. ఎంకరేజ్ చెయ్యండి" అని చెప్పాడట. ఆంధ్ర యూనివర్సిటిలో తను చేసిన మిమిక్రీ‌కి గాను గోల్డ్ మెడల్ కూడా సాధించాడట.

తర్వాత 2013లో ఆర్జేగా తన కెరీర్ స్టార్ట్ చేససిన సూర్య, ఓ వైపు ఆర్జెగా మరోవైపు యాంకర్ గా బిజీ అయిపోయాడు. తర్వాత 'గుంటూరు టాకీస్', 'గరుడావేగ' వంటి సినిమాలలో కూడా నటించాడు. తర్వాత ఇస్మార్ట్ న్యూస్ ఆడిషన్స్ కి వెళ్లగా, అక్కడ ఇతని ట్యాలెంట్ చూసి సెలక్ట్ చేసారంట. కాగా ప్రస్తుతం ఇస్మార్ట్ న్యూస్ లో కొండబాబుగా చేస్తున్నాడు. ఆ కొండబాబు క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చడంతో, అది పాపులర్ అయింది. ఆ తర్వాత సూర్యని జూనియర్ విజయ్ అని పిలుస్తున్నారు. తను కష్టపడి సంపాదించి, కూడబెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న లకి కొత్త ఇల్లుని కొని, గిఫ్ట్ గా ఇచ్చాడంట. అంతే కాకుండా వాళ్ళు కష్టపడొద్దు అని చెప్పి ప్రతి నెల సూర్య ఇంటికి కొంత డబ్బుని కూడా పంపిస్తున్నాడంట. ఈ రోజుల్లో సూర్యలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు అని అంటున్నారు తన గురించి తెలిసిన వాళ్ళు.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి పదిహేనవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన‌ సూర్య. తనదైన శైలిలో అందరిని అలరిస్తూ, ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోన్నాడు. హౌస్ లో జరిగే ప్రతీ టాస్క్ లో పాల్గొంటూ, అన్నింట్లో తనదైన స్టైల్ లో గేమ్ ని ఆడుతున్నాడు. అలాగే మిమిక్రీలతో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే ఎలిమినేట్ అయిన ఆరోహి వల్ల కొంచెం అట వెన్నక్కి వెళ్ళింది అని చెప్పాలి. తను బయటికి వెళ్ళాక అటలో కాస్త ముందుకెళ్ళగా, ప్రస్తుతం ఇనయాతో క్రష్ ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కాగా గేమ్ పై కొంచెం ఫోకస్ తగ్గినట్లుగా అనిపిస్తోంది. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి కెప్టెన్ అయ్యాడు.

అయితే సూర్య రెమ్యూనరేషన్ రోజుకి నలభై వేల నుండి నలభై అయిదు వేల వరకు ఉండొచ్చని బయట ప్రచారం జరుగుతోంది. కాగా తను మాత్రం హౌస్ లో కొత్త కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. చివరి వరకు ఉండి ఈ సీజన్ విజేతగా నిలుస్తాడో? లేదో? చూడాల్సి ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.