English | Telugu
అందుకే నాకు సుధీర్ అంటే ఇష్టం!
Updated : Jul 28, 2022
సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన వ్యక్తిత్వంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుని బుల్లి తెర మీద మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనికి లేడీ ఫ్యాన్ ఫాలోవర్లు చాలామంది ఉన్నారు. ఐతే ఇటీవల సుధీర్ గురించి 'దర్జా' మూవీ ఇంటర్వ్యూలో అక్సా ఖాన్ కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. ఈటీవీ గురించి, మల్లెమాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు "గోల్డెన్ ఆపర్చ్యునిటీ" అని చెప్పింది అక్సా. శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్యూ అని, జబర్దస్త్ చాలా స్పెషల్ అని చెప్పింది.
అలాగే సుధీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అని అడిగేసరికి. "అతను నా గురువు.. నా మెంటార్, అతని వ్యక్తిత్వం చాలా గొప్పది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ముందు అందరిని గౌరవించడం అనేది అతనికున్న గొప్ప సంస్కారం.. నాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్ కూడా" అని అంటోంది అక్సా.
"అతను వ్యవహరించే తీరు చాలా స్వీట్ గా ఉంటుంది. మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఇలాంటి ఎన్నో మంచి క్వాలిటీస్ నేను అతని దగ్గరనుంచి నేర్చుకున్నా. అందుకే నేను అతన్ని గురువుగా చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అందుకే నాకు సుధీర్ అంటే ఇష్టం" అంటూ సుధీర్ లో ఆడియన్స్ కు తెలియని ఎన్నో గుణాల్ని ఆఖ్సా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటే సుధీర్ ని చూసి నేర్చుకోవాలంటూ సింపుల్ గా చెప్పింది అక్సా.