English | Telugu
Brahmamudi : కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయనున్న అప్పు.. తన నిర్ణయం సరైనదేనా!
Updated : Nov 28, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -889 లో...అప్పుని కళ్యాణ్ బయటకు తీసుకొని వెళ్తాడు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందని అప్పు అంటుంది. వద్దు మా అమ్మ తిడుతుందని కళ్యాణ్ అంటాడు. దాంతో అప్పు గొడవ చెయ్యడం తో ఐస్ క్రీమ్ దగ్గర కళ్యాణ్ కార్ ఆపుతాడు. పక్కనే కదా మా స్టేషన్ కి వెళ్లి అందరికి హాయ్ చెప్పేసి వస్తానని అప్పు స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ ఒకావిడ తన బిడ్డని వెతకమని ఏడుస్తుంటే కానిస్టేబుల్ తనపై కోప్పడుతాడు.
ఎందుకు అలా వాళ్ళతో మాట్లాడుతున్నావని అప్పు కానిస్టేబుల్ పై కోప్పడుతుంది. ఏమైందని అడుగుతుంది. నా కూతురు సంవత్సరం నుండి కన్పించడం లేదని ఆవిడ చెప్తుంది. సంవత్సరం నుండి కనిపించడం లేదా డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందని కానిస్టేబుల్ పై అప్పు కోప్పడుతుంది. దాంతో లోపలికి వెళ్లి తన హై ఆఫీసర్ ని కలిసి మాట్లాడుతుంది. తన కూతురు ఎప్పుడో చనిపోయింది.. ఆ విషయం వాళ్ళ అయన కూడా చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ చేసాం అదే చెప్పాము.. అయిన ఆవిడా వినట్లేదని ఆఫీసర్ అంటాడు. అలా ఆవిడ తన కూతురు ఉందని అంటుంటే డీప్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి కదా అని అప్పు అంటుంది. ఇక ఆ ఒక్క కేసు పట్టుకొని కూర్చుంటామా అని ఆఫీసర్ అప్పుపై కోప్పడతాడు. కాసేపటికి అప్పు వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్, కావ్యల దగ్గరికి అపర్ణ, సుభాష్ వస్తారు. మీరు రాహుల్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఎందుకో తప్పు అనిపిస్తుందని అంటారు. అదేం లేదు ఈ ఇంట్లో అప్పుకి నాకు సమానమైన గౌరవం లభిస్తుంది.. అది మా అక్కకి కూడా దక్కాలని కావ్య అంటుంది.
రాహుల్ కి ఒక ఛాన్స్ ఇస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటాడని రాజ్ చెప్తాడు. మరొకవైపు అప్పు పడుకుంటుంది. కలలో స్టేషన్ లో కన్పించినా ఆవిడ తన కూతురిని పట్టుకొని ఏడుస్తున్నట్లు కల వస్తుంది. ఉల్లిక్కి పడి లేచి కళ్యాణ్ కి చెప్తుంది. ఆ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి లేదంటే రెగ్రెట్ గా ఫీల్ అవుతానని అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.