English | Telugu

మాన్సీకి చుక్క‌లు చూపించిన అను

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. విజ‌య‌వంత‌మైన మ‌రాఠీ సీరియ‌ల్ `తుల‌ఫ‌టేరే` ఆధారంగా తెలుగులో న‌టుడు, `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గ‌త జ‌న్మ‌ల ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో రూపొందింది. కీల‌క పాత్ర‌లో క‌న్న‌డ న‌టి వ‌ర్ష న‌టించింది. రాజ‌నందిని ఆత్మ ఆర్య కోసం త‌పించే ఫాంట‌సీ క‌థ నేప‌థ్యంలో రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త ఏడాది కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

మంగ‌ళ‌వారం రాత్రి ఎపిసోడ్ హైలైట్స్ ఒక‌సారి చూద్దాం. గాఢ నిద్ర‌లో వున్న అను వెంట‌నే లేచి రాజ‌నందిని రూమ్‌లోకి వెళుతుంది. గ‌దిలోకి వెళ్లాక అను నుంచి రాజ నందిని ఆత్మ బ‌య‌టికి వ‌స్తుంది. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్ అయిన అను ఎవ‌రు మీరు అని అడుగుతుంది. అను క‌ళ్ల ముందున్న ఆత్మ నా పేరు రాజ‌నందిని అని చెబుతుంది. నేనే నువ్వు.. నువ్వే నేను అని చెప్ప‌డంతో అను కొంత క‌న్ప్యూజ‌న్‌కి గుర‌వుతుంది. మ‌రి మిమ్మ‌ల్ని ఏం చేశార‌ని అను అడిగితే చంపేశార‌ని, నా లాగే నిన్ను కూడా అంతం చేయాల‌ని చూస్తున్నార‌ని చెబుతుంది రాజ‌నందిని.

ఇదిలా వుంటే అను... రాజ‌నందిని గ‌దిలోకి వెళ్లిన విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మాన్సీ ఎలాగైనా అనుని అంద‌రి ముందు దోషిగా నిల‌బెట్టాల‌ని ప్లాన్ చేస్తుంది. వెంట‌నే డోర్ లాక్ చేసేసి అంద‌రిని వెళ్లి పిల‌వాల‌ని వెళ్ల‌బోతుంది. ఇంత‌లో అను వెళ్లిపోతే ఇంత వ‌ర‌కు చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా అని అక్క‌డే కాప‌లా కాస్తూ వుంటుంది. క‌ట్ చేస్తే రాజ నందిని త‌ను వ‌చ్చిన విష‌యం మ‌ర్చిపోతావ‌ని, అలా అయితే నిన్ను కూడా కాపాడ‌టం క‌ష్టం అవుతుంద‌ని అనుకి చెప్పి గుర్తుల కోసం ఓ డైరీలో రాసుకోమంటుంది. అలా డైరీలో రాసుకుని గ‌దిలోంచి బ‌య‌టికి వ‌చ్చేస్తుంది అను. అయితే అనులో రాజ‌నందిని ఆత్మ అలాగే వుంటుంది. ఈ విష‌యం తెలియ‌ని మాన్సీ.. అను రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయావ‌ని, ఈ విష‌యాన్ని అంద‌రికి చెప్పేస్తానంటుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అను .. మాన్సీకి చుక్కులు చూపించేస్తుంది. మంగ‌ళ వారం జ‌రిగిన ఈ ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.