English | Telugu
రౌడీల ఉచ్చులో అను.. ఆర్య కాపాడతాడా?
Updated : Dec 30, 2021
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ధారావాహిక `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` ఫేమ్ వెంకట్ శ్రీరామ్ నటిస్తూ ఈ సీరియల్ ని నిర్మించారు. కన్నడ నటి వర్ష కీలక పాత్రలో నటించింది. రాజనందిని ఆత్మ కథ, పగా, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ తాజాగా కీలక అంకానికి చేరుకుంది. తనకు రాజనందిని చెప్పిన విషయాల్ని ఛేధించడం మొదలు పెట్టిన అనుకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతూ వుంటాయి.
ఈ క్రమంలో ఆర్య పడుకోవడంతో రాజనందిని చెప్పినట్టుగానే మహల్ లో దాగున్న రహస్యాన్ని ఛేధించడం కోసం అను.. రాజనందిని వాడిన కారులో ఒంటరిగా రాజ మహల్ కు వెళుతుంది. అక్కడ రాజనందిని బోర్డుని చూసి ఇక్కడే అసలు రహస్యం దాగి వుందని గ్రహిస్తుంది. ఇంతలో రౌడీలు కొంత మంది అనుని లోనికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తరువాత అనుని వెంబడించడం మొదలుపెడతారు. ఇది గమనించిన అను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది.
Also Read: షాకింగ్ రోల్‌లో రాజేంద్రప్రసాద్.. ఉద్వేగభరితంగా 'సేనాపతి' ట్రైలర్!
ఇంతలో అనుకి ఎదురుగా ఓ కార్ లైట్లు వెలుగుతాయి. ఆ లైట్ల వెలుతురులోంచి ఆర్య కనిపించడంతో కొండంత ధైర్యం వచ్చిన అను అతని వైపు పరుగెడుతుంది. ఆర్య రావడాన్ని గమనించిన రౌడీలు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వారిని వెంబడిస్తూ ఆర్య కూడా పరుగెడతాడు. కానీ చిక్కకుండా తప్పించుకు పారిపోవడంతో అక్కడి నుంచి అనుని ఇంటికి తీసుకొస్తాడు ఆర్య.. కట్ చేస్తే ఆర్య ఇంటి వద్ద సీన్ మరోలా వుంటుంది. అను తీసుకెళ్లిన కారు గురించి శారదా దేవికి చెబుతూ మాన్సీ పెద్ద ఇష్యూ చేయాలని ప్రయత్నిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. ఎలాంటి మలుపులు తిరగబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.