English | Telugu

సినిమాల్లో హీరోయిన్ కి ఏం ఉండదు...


బుల్లితెర మీద శ్రీప్రియ రెడ్డి -అన్షు రెడ్డి వీళ్లిద్దరి గురించి తెలియని వాళ్ళు లేరు. అన్షు రెడ్డి ఢీ షోలో కంటెస్టెంట్ గా ఉంది. ఇక ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా శ్రీప్రియ కూడా వచ్చి అన్షుతో డాన్స్ చేసింది. అలా వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్ షిప్ యొక్క డెప్త్ ఎంతో చూపించారు. ఇక రీసెంట్ గా వీళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి హీరోయిన్ గురించి మాట్లాడారు. సినిమాల్లోకి ఎందుకు ట్రై చేయలేదు అన్న ప్రశ్నకు " అక్కడ హీరోయిన్ కె ఎం ఉండదు అంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్...మొత్తం హీరో రిలేటెడ్ ఉంటుంది." అంటూ శ్రీప్రియ రెడ్డి చెప్పింది. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ లో నటిస్తున్న అన్షు రెడ్డి ఈ పాయింట్ కి క్లారిటీ ఇచ్చింది. "సీరియల్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్, విలన్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ గా ఉంటుంది.

ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్ లో నా రోల్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు నేను సీరియల్ ని వదిలేసి మూవీకి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ లా ట్రీట్ చేస్తారు తప్ప పెద్దగా ఇంపార్టెన్స్ ఐతే ఇవ్వరు. ఇంత కంఫర్ట్ జోన్ ని వదులుకుని మేము మూవీస్ లోకి ఎందుకు ట్రై చేయాలి." అని చెప్పింది. "నేను కొన్ని మూవీస్ లో చేశా..అక్కడ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు. జస్ట్ అలా నిలబెడతారు అంతే..ఇక్కడ ఇంత కష్టపడి ఫేమ్ తెచ్చుకుని సినిమాల్లోకి వెళ్లి పోగొట్టుకోవడం ఎందుకు" అని చెప్పింది. ఇక వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.