English | Telugu

వద్దురా ప్లీజ్...వాళ్లంతా డోర్స్ క్లోజ్ చేసుకునేవాళ్లు


సౌమ్య రావు..జబర్దస్త్ లో కొన్ని రోజులు యాంకర్ గా చేసింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత ఒక షోలో సౌమ్యకి తెలుగు రాదు అంటూ నూకరాజు చేసిన కామెంట్స్ కి సౌమ్య కూడా పట్టుబట్టి కొంతవరకు తెలుగు నేర్చుకుని ఇంతకుముందు కంటే చాలా బాగా మాట్లాడడం చేస్తోంది. ఇక ఇప్పుడు ఢీ షోలో మెంటర్ గా ఆదితో పాటు చేస్తోంది. ఇక ఒక ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయ్యింది. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో "సంకురాత్రి కోడి" అనే పాటను చాలా చక్కగా పాడి వినిపించింది. "ఒక పెద్ద హీరో ఫ్లయిట్ లో నీ నంబర్ తీసుకుని సౌమ్య నీతో మాట్లాడాలని ఉంది అని చెప్పారట" అని యాంకర్ వర్ష అడిగేసరికి సౌమ్య "వద్దురా కొడతాను. దణ్ణం పెడతాను ఆ మ్యాటర్ మాత్రం వద్దురా ప్లీజ్" అంటూ సౌమ్య నవ్వుతూ చెప్పింది.

"పేదరికం అనేది చాలా బాడ్ రా. నాన్నలకు బిడ్డలను పెంచే శక్తి ఉన్నప్పుడే కనాలి. నా ఫాథర్ గురించి ఎందుకులే వదిలేయ్ ఆయన గురించి. మా అమ్మా చాలా బాధను అనుభవించింది. నీకు తెలుసా మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే పక్కింటి వాళ్లంతా డోర్స్ క్లోజ్ చేసుకునేవాళ్లు. అమ్మాయి ఉందా. పెద్దదయ్యిందా ..చదువుకుంటోందా అని అడిగేవాళ్ళు. ఒక రోజు నైట్ 2 గంటలకు నేను నా బ్రదర్ మా అమ్మ బస్ స్టాండ్ లో పడుకున్నాం. రెండు రోజులు నేను ఫుడ్ తినలేదు. తిరుపతి వెళ్ళాక నేను దేవుడిని దర్శించుకోలేదు. ఎవరైనా ఫుడ్ ఎప్పుడు పెడతారా అనే ఎదురు చూసాను." అంటూ సౌమ్య తన జీవితంలో ఉన్న కష్టాలను చెప్పింది. ఇక ఢీ షోలో సౌమ్య మాట్లాడే తెలుగు మీద ఆది కూడా కామెంట్స్ చేస్తూ ఉంటాడు అలాగే సరిచేస్తూ ఉంటాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.