English | Telugu
ఫ్యామిలీ స్టార్ మూవీలో చందమామ?
Updated : Apr 1, 2024
సినిమాలలో బుల్లితెర నటీనటులు కన్పిస్తే వారికి పండగలా ఉంటుంది. అలాంటిదే ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లితెర యాంకర్ అంజలి పవన్ కూతురు చందమామ ఓ సినిమాలో నటించదనే వార్తలు వినిపిస్తుండగా.. వాటికి సమాధానాలిస్తూ అంజలి పవన్ ఓ వ్లాగ్ చేసింది. అదేంటో ఓసారి చూసేద్దాం.
పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ లో అంజలిపవన్ కూతురు చందమామ ఉందా లేదా అనే డౌట్ చాలామందిలో మొదలైందని తను చెప్పుకొచ్చింది. తన భర్త పవన్, కూతురు చందమామతో కలిసి విజయ్ దేవరకొండతో వ్లాగ్ చేసింది. మీ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరని అంజలి అడుగగా.. మా ఇంట్లో ఫ్యామిలీ స్టార్ మా అమ్మ అని విజయ్ ఈ వ్లాగ్ లో చెప్పాడు. బయటకెళ్ళి అంతపని చేస్తాం మేమే ఫ్యామిలీ స్టార్ అని పవన్ అనగా.. అవునా సరుకులు నెలకి ఎంతవుతాయో తెలుసా అని అంజలి ప్రశ్నించగా తను సైలెంట్ అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చుట్టూ చాలామంది నటీమణులు ఉండగా.. వారందరికి చాలా ఓపికతో వ్లాగ్స్ చేశాడని అంజలి ఇందులో చెప్పుకొచ్చింది. అక్కడ జరిగిన కొన్ని షాట్స్ ని చూపిస్తూ అంజలి ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి తన సబ్ స్క్రైబర్స్ కి చెప్పుకొచ్చింది.
మొగలిరేకులు సీరియలో నటించిన అంజలి.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తనకి బోలెడు సినిమాల్లో, టెలివిజన్ రంగంలో ఆఫర్లు వచ్చాయి. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలి హైదరాబాద్ లో జన్మించింది. తన వ్యక్తిగతంగా, వృత్తిపరంగాను ఎంతో ఉన్నంతంగా ఉంటుందని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లని చూస్తుంటేనే తెలుస్తుంది. అయితే జనవరి 24, 2015 న సినిమా రంగంలో పనిచేస్తున్న సంతోష్ పవన్ ని పెళ్ళిచేసుకుంది అంజలి. అప్పటినుండి తన పేరును అంజలి పవన్ గా మార్చుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అంజలి పవన్. అంజలి తన భర్త పవన్ తో కలిసి 'నీతోనే డ్యాన్స్ షో' లో పర్ఫామెన్స్ చేసింది. వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు రాధ, తరుణ్ మాస్టర్, సదా అంతా ఫిధా అయ్యారు. ఈ వయసులో ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం చాలా కష్టమంటూ రాధ కూడా తనని పొగిడారు.