English | Telugu

ఆర్జీవితో మింగిల్ ఐన రీతూ...ఇక ఫ్యూచర్ సెట్!


ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో చంద్రమోహన్ పక్కన చేసే హీరోయిన్స్ స్టార్స్ అవుతారు అని ఒక టాక్ ఉండేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా క్రేజీనెస్ లో ఆయన ప్లేస్ లోకి ఆర్జీవీ వచ్చారు. ఐతే ఆర్జీవీతో ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు ఆయనతో పార్టీస్ లో మింగిల్ ఐన లేడీస్ అంతా కూడా ఇప్పుడు మంచి రేంజ్ లో ఉన్నారు. ఆరియానా, అష్షు రెడ్డి ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు రీతూ చౌదరి వంతు వచ్చినట్టు ఉంది. ఆయన పక్కన నిలబడి ఫోజులిచ్చింది.

ఇక ఆర్జీవీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద రెండు గ్లాసులు కూడా కనిపించాయి. ఆర్జీవీతో ఎవరు ఉన్నా కూడా వాళ్ల స్టార్ ఓవర్ నైట్ చేంజ్ ఐపోతుంది. అలాంటి ఆర్జీవీతో రీతూని చూసేసరికి నెటిజన్స్ అంతా కూడా మిక్స్డ్ కామెంట్స్ పెడుతున్నారు. "గురూజీ మామూలోడు కాదు, అప్పుడు అష్షు, ఆరియానా, ఇప్పుడు రీతూ చౌదరి. నువ్వు పడ్డావ ఆర్జీవీ చేతుల్లో గోవిందా గోవిందా...నెక్స్ట్ బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తుంది...హహ అంటారు హీరోయిన్ ఇంట్రడక్షన్. మాష్టర్ చేతిలో పడితే ఫ్యూచర్ సెట్ అయిపోతుంది..." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీతూ చౌదరి సోషల్ మీడియా స్టార్. అటు షోస్, ఈవెంట్స్, ఇటు యుట్యూబ్, ఇన్స్టా ఏది వదిలిపెట్టకుండా కవర్ సాంగ్స్ లో చేస్తూ మరో వైపు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఆర్జీవీ డెన్ కి వచ్చింది. మరి ఆర్జీవీ మూవీలో ఛాన్స్ కోసమా ? ఏదైనా షో చేస్తోందా ? ఆర్జీవితో మింగిల్ ఐన రీతూకి నెక్స్ట్ బిగ్ బాస్ కి అవకాశం వస్తుందా ? ఇక ఛాన్సులు క్యూ కడతాయా ? చూడాలి.