English | Telugu

యూట్యూబ్ లోని రక్ష నింబార్గి ఆ వీడియో చూశారా?


బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోను తాజాగా మొదలైన ఎటో వెళ్ళిపోయింది ‌మనసు సీరియల్ కి అప్పుడే ఫ్యాన్ పేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి. రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గికి ఇన్ స్టాగ్రామ్ లో సపరేట్ ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. అయితే తను యూట్యూబ్ లో తాజాగా చేసిన ఓ వ్లాగ్ నెట్టింట వైరల్ గా మారింది.

సీతాకాంత్, రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి ప్రధాన పాత్రలుగా తాజాగా ' ఎటో వెళ్ళిపోయింది మనసు ' సీరియల్ స్టార్ మా టీవీలో ప్రారంభమైంది. భార్యామణి, అష్టా చెమ్మ సీరియల్స్ లలో నటించి సీతాకాంత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. రక్ష నింబార్గి కన్నడ భామ. బింగో అనే కన్నడ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేస్తుంది. రక్ష నింబార్గి తెలుగులో చేస్తోన్న తొలి సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు. ఇదే సీరియల్ లో సందీప్ భార్యగా శ్రీవల్లి చేస్తోంది. శ్రీవల్లి అసలు పేరు భవిష్య. తను కూడా యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. భవిష్య వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ లో శ్రీవల్లి వ్లాగ్స్ చేస్తూ విశేష ఆదరణ పొందుతుంది. రక్ష చేసిన ఈ వ్లాగ్ లో భవిష్య కూడా ఉంది. అయితే రక్ష కన్నడలో మాట్లాడగా తనకేం అర్థం కాకుండా ఎక్స్ ప్రెషన్ పెట్టింది. తనని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని వారికి థాంక్స్ చెప్పింది రక్ష. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తానని రక్ష, భవిష్య ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చారు.

ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ రామలక్ష్మి, సీతాకాంత్ మధ్యలో చాలానే ఏజ్ గ్యాప్ ఉంది. కానీ వారిది పూర్వజన్మ బంధమని సీరియల్ మొదటి ఎపిసోడ్ లో చూపించారు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌లలో సూపర్ ట్విస్ట్ వచ్చేసింది. రామలక్ష్మి వాళ్ళ నాన్నకి , సీతాకాంత్ వాళ్ళ నాన్న శ్రీలతకి మధ్య ఏదో తెలియని రహస్యం దాగి ఉందని తెలుస్తోంది‌. అలాగే రామలక్ష్మి, సీతాకాంత్ పెళ్ళి చేసుకున్నారని అందరిని నమ్మించగా.. మాణిక్యం మరో మెలిక పెట్టాడు. రామలక్ష్మి ప్రెగ్నెంట్ అయితేనే సిరి, ధనల పెళ్ళి జరుగుతుందని చెప్పాడు. మరి రామలక్ష్మి, సీతాకాంత్ లు మాణిక్యం చెప్పినట్లు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. డైరెక్టర్ పెట్టిన ఈ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అయితే మరి అసలు గతంలో ఏం జరిగిందనేది కీలకంగా మారింది. మాణిక్యం, శ్రీలతల మధ్య జరిగిన దాగి ఉన్న మిస్టరీ ఏంటనే క్యూరియాసిటితో ఈ సీరియల్ సాగుతుంది. అయితే రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటో మీరూ చూసేయ్యండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.