English | Telugu
Biggboss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అంజలి పవన్!
Updated : Sep 3, 2024
బిగ్ బాస్ సీజన్ మొదలవ్వకముందే కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు లీక్ అవుతుంది. అయితే చివరి వరకు ఎవరు వెళ్తారనే క్లారిటీ ఉండదు. అయితే హౌస్ లోకి వెళ్ళలేకపోయిన వారికి ఏదైన అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం కచ్చితంగా బిబి టీమ్ వద్దంటారు.
అంజలి పవన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందనే వార్త గ్రాంఢ్ లాంచ్ మొదలయ్యేవరకు వినిపించింది. కానీ చివరి నిమిషంలో వెళ్ళలేదు. ఇక దానికి కారణం చెప్తూ అంజలి పవన్ తన యూట్యూబ్ ఛానెల్ లో ' Sudden గా వీళ్ళకి ఏం అయ్యిందంటే.. My Biggboss 8 Telugu Entry Clarity ' అంటూ వ్లాగ్ ని చేసింది. ఇందులో తనేం చెప్పిందంటే.. మా ఆయనకి చికెన్ గున్యా వచ్చింది. తనని హాస్పిటల్ కి తీసుకెళ్ళా మూడు రోజుల నుండి హాస్పిటల్ లోను ఉన్నాను. అందుకే బిగ్ బాస్ 8 కి వెళ్ళలేకపోయాను. దయచేసి ఎవరు ట్రోల్స్ చేయకండి. మా ఇంట్లో పాప ఉంది. మా ఆయనని చూసుకోవడానికి నేనే ఉన్నాను. అర్థం చేస్కోండి అంటు అంజలి పవన్ చెప్పింది. దయచేసి పాప ఫోటోలు పెట్టి చెత్త చెత్త థంబ్ నేల్స్ తో వీడియోలు చేయకండి.. నా గురించి, నా భర్త గురించి రాసిన నేను తీసుకుంటాను కానీ నా పాప గురించి మాత్రం అలా రాయకండి అంటు అంజలి పవన్ యూట్యూబ్ థంబ్ నేల్ బ్యాచ్ ని రిక్వెస్ట్ చేసింది.
అయితే ఇదే వ్లాగ్ లో అంజలి పవన్ మరో హింట్ ఇచ్చింది. అదేంటంటే బిగ్ బాస్ ఎంట్రీపై ఇప్పుడే చెప్పలేను అని అంది.. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తను హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి అంజలి పవన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందా లేదా కామెంట్ చేయండి.