English | Telugu

ఓటీటీలోకి అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్

ఓటీటీలో తిరుగులేని రారాజుగా నిలబడడానికి 'ఆహా' వ్యూహాత్మకంగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది. సింగింగ్ షో నిర్వహించింది, అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షో, డాన్స్ షో ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి ముందుకొస్తోంది.. ఇక ఇప్పుడు కామెడీ షోతో ఎంట్రీ ఇవ్వబోతోంది.

టాప్ స్టార్స్ అంతా కూడా హోస్ట్స్ గా, జడ్జెస్ గా బుల్లి తెర మీద కనిపిస్తూ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి బుల్లి తెర మీద తన సత్తా చూపించడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షోకి జడ్జిగా ఉన్నారు. ఇక ఇప్పుడు 'కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌' పేరుతో ఓ కామెడీ షో ద్వారా ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈ షోకి జబర్ధస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్నాడు.

అనిల్ రావిపూడి స్టైలిష్ లుక్ తో చేతిలో సూట్ కేస్ తీసుకుని 'అరె.. స్టాక్స్ దుమ్ము లేపడానికి అందరూ రెడీగా ఉండడి.. బొమ్మ దద్దరిల్లిపోద్ది' అని చెప్తూ ఎంట్రీ ఇచ్చాడు. అందరినీ అలరించే కామెడీ షో 'కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌' నవంబర్ నుంచి మొదలుకానుంది. ఈ షోని ఎస్‌ఓఎల్‌ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈ షో నిర్వాహకులు తెలిపారు. ఐతే కామెడీ చిత్రాలతో అలరించే అనిల్ రావిపూడి బుల్లితెరపై ఎలా నవ్విస్తారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.