English | Telugu

మన కష్టాలు చెప్తే మీద చేతులేసేవాళ్ళే ఎక్కువ..!

సౌమ్య బుల్లితెర యాంకర్ గా కొంతకాలం చేసింది. ఇప్పుడు ఢీ షోకి మెంటార్ గా ఆదితో కలిసి వస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలు చెప్పింది.

"మా నాన్న మా ఊరిలో అన్నీ అప్పులు చేసేసి వెళ్ళిపోయాడు. ఇచ్చిన వాళ్ళు, తీసుకున్నాయన బాగున్నారు. కానీ మేము బలైపోయాం. అప్పులు ఇచ్చిన వాళ్లంతా మా ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేసేవాళ్ళు. అమ్మకి భయం చాలా ఎక్కువ..ఎం చేయాలో తెలిసేది కాదు. అప్పట్లో మా ఇంటిని నడిపింది నేను. చదువుకుంటూనే జాబ్స్ చేసాను. వాటితోనే ఇల్లు గడిచేది. ఇంటికి చుట్టాలు వస్తే పాలు, కాఫీ పొడి కోసం అమ్మ పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్తుందని వాళ్ళు తలుపులు వేసుకునేవారు. చుట్టాల పెళ్లిళ్లకు వెళ్తే మంచి చీర, నగలు లేవు అని మా అమ్మను వెనక్కి చివరన కూర్చోబెట్టేవాళ్ళు. నేను న్యూస్ రీడర్ గా పని చేసాను. అలాగే ఒక లాయర్ దగ్గర పని చేశా. అక్కడ నా కష్టాలు తెలిసి జాబ్ ఇంపార్టెంట్ అని తెలిసి ఆ లాయర్ నా భుజాల మీద చేతులు వేసేవాడు. టచ్ చేసేవాడు. ఎక్కడా కూడా మనకు కష్టాలు ఉన్నాయని చెప్పుకోకూడదు. నువ్వు లేకపోయినా నేను బతగ్గలను అనేలా ఉండాలి. ఈ టెన్షన్స్ మధ్య అమ్మకు బ్రెయిన్ కాన్సర్ వచ్చింది.

మంచి ఫాదర్ మంచి ఫామిలీ ఉండడం కూడా ఒక తలరాత..మా నాన్న చేసిన పనికి అమ్మ మమ్మల్ని తిరుపతి తీసుకెళ్లింది. బస్ స్టాండ్ లో రెండు రోజులు తిండి లేకుండా ఉన్నా. ఎవరైనా కొంచెం అన్నం పెడతారేమో అని ఎంతలా ఎదురు చూశానో చెప్పలేను. ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు నాకు చిన్నపిల్లలను చూస్తే పెద్దగా ఫీలింగ్ రాదు. వాళ్లకు భవిష్యత్తు ఉంది. కానీ ముసలి వాళ్ళను చూస్తే బాధేస్తుంది. ఇది కలియుగం.. ఎవరినీ ఏమీ అనలేము. ఇలాంటి కాలంలో ఖర్మ, ధర్మంని అనుసరించి బతకాలి. మనం ఒకరికి చెడు చేస్తే మనకు తిరిగి వస్తుంది." అంటూ లైఫ్ గురించి ఖర్మ గురించి చెప్పుకొచ్చింది సౌమ్య.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.