English | Telugu
Illu illalu pillalu : నర్మద, ప్రేమలపై భాగ్యం కన్నింగ్ ప్లాన్.. అది జరిగేనా!
Updated : Aug 17, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -239 లో.. ముగ్గురు కోడళ్ళు వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అన్నతమ్ముళ్లు ముగ్గురు తమ భార్యలకి చీరలు కొనుక్కొని తీసుకొని వస్తారు. నర్మదకి సాగర్ చీర ఇవ్వగానే కోపంగా మొహం తిప్పుకుంటుంది. నన్ను ప్రేమించి తప్పు చేసాను అన్నావ్ కదా అని అడుగుతుంది. సాగర్ రిక్వెస్ట్ చెయ్యడంతో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆ చీర తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది నర్మద.
ఆ తర్వాత శ్రీవల్లికి చందు చీర తీసుకొని వస్తాడు. ఎక్కడ డబ్బు అడుగుతాడోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. కానీ చందు చీర ఇవ్వగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమకి ధీరజ్ చీర తీసుకొని వచ్చి ఇస్తాడు. నువ్వు అన్నమాటలకి నేను బాధపడుతున్నానని.. అది రీప్లేస్ చెయ్యడానికి తీసుకొని వచ్చావా అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రేమ. నేనొక వస్తువుని కదా నాకు ఫీలింగ్స్ ఉంటాయా అని ప్రేమ అనగానే నేను ఒక్కసారి అన్నందుకు అదే మాటపట్టుకొని వేలాడతావని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు.
ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం కోసం అందరు రెడీ అవుతారు. తమ భర్తలు తెచ్చిన చీరలు కట్టుకొని తోటికోడళ్ళు అందంగా ముస్తాబవుతారు. ఆ తర్వాత భాగ్యం శ్రీవల్లికి ఏదో ప్లాన్ చెప్తుంది. వాళ్ళని ఘోరంగా అవమానించాలి ఇంకొకసారి నీ జోలికి రాకుండా చెయ్యాలని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.