English | Telugu

సింగర్ సునీత నోటా అల్లు అర్జున్ డైలాగ్....15 న డాలస్ లో ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్

సింగర్ సునీత పాట పాడినా, మాట్లాడినా వినబుద్దేస్తుంది. తెలుగు సింగెర్స్ లో సునీతకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కేవలం సింగింగే కాదు డబ్బింగ్ కూడా చెప్తారు. మ్యూజిక్ ఈవెంట్స్‌లో హోస్ట్‌గా, యాంకర్‌గా కూడా ఈమె సందడి చేస్తారు. ఈమె లైఫ్ ఒక ఓపెన్ బుక్...పాటలు పాడటంతో పాటు సింగింగ్ షోస్ కి జడ్జిగా ఉంటుంది. అలాంటి సునీతకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాష్, కూతురు శ్రేయ. కొడుకు ఆకాష్ ని హీరోని చేసేసారు సునీత..త్వరలో అతను నటించిన "సర్కార్ నౌకరి" ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక కూతురిని కూడా సింగర్ గా చేసేసారు సునీత. ఆమె ఆల్రెడీ నాగ‌చైత‌న్య న‌టించిన "స‌వ్య‌సాచి" మూవీలో " టిక్ టిక్ టిక్అ "నే పాట‌ను పాడారు కూడా. ఇక సునీత-శ్రేయ కలిశారంటే అల్లరి మాములుగా ఉండదు.

ఇప్పుడు కూడా అలా సరదాగా చేసిన ఒక రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు సునీత. అల్లు అర్జున్ మూవీలోని ఒక ఫేమస్ డైలాగ్ ఐన "ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా" అనేదాన్ని సునీత చేత వాళ్ళ అమ్మాయి శ్రేయ చెప్పించింది. ఆ వీడియోని అల్లు అర్జున్ పిక్ తో కొలెజ్ చేసి "మేడం భలే ముద్దుగా చెప్పారు కదా డైలాగ్" అని కాప్షన్ రాసి పోస్ట్ చేశారు. ఇక సునీత ఇన్స్టా పేజీ మొత్తం చూస్తే వాళ్ళ పిల్లలు, పూలు, పాటలు ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈమె ఇళయరాజా గారితో కలిసి 15 న డాలస్ లో ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా చేయబోతున్నారు. సునీత కుమార్తె శ్రేయ అచ్చం అమ్మలాగే ఎంతో అందంగా ఉంటుంది. అద్భుతమైన స్వరాన్ని సొంతం చేసుకున్న శ్రేయ.. ఫ్యూచర్ లో సింగర్‌గా రాణిస్తుందో.. హీరోయిన్‌గా మెప్పిస్తోందో చూడాలి. సునీత తన పిల్లలతో ఉన్న ప్రతీ మూమెంట్ ని అలాగే తన పర్సనల్ అప్ డేట్స్ ని తన కన్సర్ట్స్ కి సంబంధించిన విషయాలను కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.