English | Telugu

అన‌సూయ కోసం రామ్‌చ‌ర‌ణ్ చేసిన ప‌ని ఇది!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో 'రంగస్థలం' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలో ప్రతీ పాత్ర ఆడియన్స్ ను అలరించింది. ముఖ్యంగా రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయకు మంచి పేరొచ్చింది. అంతగా తన పాత్రలో జీవించేసింది. అయితే 'రంగస్థలం' సినిమా అప్పటి నుండి ఆ యూనిట్ కి సంబంధించిన వారంతా తనను అత్త అనే పిలుస్తున్నారని.. సుకుమార్ కూడా అత్త అనే పిలుస్తారని అనసూయ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం అనసూయ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా 'ఆహా'లో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ పలు యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసుకున్న కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. 'రంగస్థలం' సినిమా షూటింగ్ సమయంలో అనసూయ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా చెఫ్ ను పిలిపించి వంట చేయించేవారట. సెట్లో భోజనం సమయానికి చేపల కూర రెడీగా ఉండేదని.. కానీ అనసూయకి చేపల కూర తినే అలవాటు లేకపోవడంతో.. రామ్ చరణ్ తన చెఫ్ ను పిలిపించి ఆమె కోసం పన్నీర్ ను పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండించారట.

ఆ కూర ఎంతో రుచిగా ఉండేదని.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోకి అలా చేయాల్సిన అవసరం లేదని.. కానీ తన కోసం చెఫ్ తో ప్రత్యేకంగా అలా వంట చేయించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ 'పుష్ప' సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు.