Read more!

English | Telugu

నేను జబర్దస్త్ ని చాలా మిస్సవుతున్నా!

టాలీవుడ్ మోస్ట్ చార్మింగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మూవీస్ లో కూడా చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ ఏ పోస్ట్ పెట్టినా, ఎలాంటి పిక్ పెట్టినా ఇట్టే ట్రెండ్ ఇపోతూ ఉంటుంది. 

ఇక జబర్దస్త్ నుంచి కావాలనే వచ్చేశానని అక్కడ జరుగుతున్న బాడీ షేమింగ్ కామెంట్స్ నచ్చకే అక్కడ చేయడం లేదని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇక అప్పుడప్పుడు ఫాన్స్  అడిగే  ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఎక్స్ట్రా మాట్లాడితే కౌంటర్లు  కూడా వేస్తుంది. అలా ఒక అభిమాని ఇటీవల  "మీ కొత్త షో ఏమిటి మేడం" అని అడిగేసరికి   ‘టీవీ షోస్ కి  కావాలనే బ్రేక్ తీసుకున్నాను, ఏదైనా మంచి ఎక్సయిటింగ్ షో వచ్చినప్పుడు చేస్తా’ అని ఆన్సర్ చేసింది. 

అలాగే ‘ఇప్పుడు జబర్దస్త్ ని మిస్ అవుతున్నారా ?’ అని అడిగిన ప్రశ్నకు “అఫ్ కోర్స్ మిస్ అవుతున్నా.. నా జీవితంలో, నా మనసులో  జబర్దస్త్ కి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కొన్ని చోట్ల  మనకు ఉండాలనిపిస్తుంది కానీ పరిస్థితులు అనుకూలించవు.. అలాంటి టైంలో రిస్క్ చేసైనా కొన్ని డెసిషన్స్ తీసుకోక తప్పదు"  అని ఆన్సర్ చేసింది. "మీరు రీసెంట్ గా పూజ చేయించుకున్నారు కదా అది దేని కోసం ?"  అనే ప్రశ్నకు " నాన్న సంవత్సరీకం ఇటీవలే అయ్యింది. దాని  తర్వాత సుదర్శన హోమం, సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదట. అందుకే చేయించాను" అని కూల్ గా ఆన్సర్ చేసింది.