English | Telugu
పది రూపాయలతో సుధీర్‌ని బకరాని చేసిన అనసూయ!
Updated : Aug 22, 2022
సుడిగాలి సుధీర్ ఎలాంటి షోనైనా ఇట్టే ఈజీగా హోస్ట్ చేసేస్తాడు. మొనాటనీ ఉండదు. సుధీర్ ఏ షోలో ఉంటే ఆ షో హైలైట్ అవుతుంది. సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సుధీర్ 'ఢీ' చేసినా, 'శ్రీదేవి డ్రామా కంపెనీ' చేసినా అవిసూపర్ హిట్‌గా నిలిచాయి. అలా సుధీర్ బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా నిలిచాడు. ఇక ఇప్పుడు సుధీర్స్టార్ మాలో సింగింగ్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. ఐతే సుధీర్ కి మాత్రం ఆ షో పెద్దగా ప్లస్ అవలేదని తెలుస్తోంది.
సుధీర్ మీద ఆ షోలో విపరీతమైన పంచులు పేలుతున్నా సరే సుధీర్ మాత్రం ఏం తెలియనట్టే నవ్వేసి ఊరుకుంటున్నాడు. లేటెస్ట్ గా హేమచంద్ర, అనసూయ, మనో.. ఇలా అందరూ కలిసి సుధీర్ మీద కౌంటర్లు వేశారు. ఈ షోలో హరిప్రియకు, సుధీర్‌కు మధ్య ఒక ట్రాక్ క్రియేట్ చేయడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు. హరిప్రియ మాత్రం సుధీర్‌ను 'అన్నయ్యా' అని పిలుస్తోంది.
ఆమెను ఇంప్రెస్ చేయాలంటే హేమచంద్రతో పాట పాడించి ప్రపోజ్ చేయాలంటూసుధీర్‌కు ఒక టాస్క్ ఇచ్చింది అనసూయ. ఇక సుధీర్ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉంటాడు. ఐతే హేమచంద్ర, మనో పిచ్చి పాటలన్నీ పాడేసి చెడగొడుతూ ఉంటారు. అలా హరిప్రియ ముందు బకరా ఐపోతాడు సుధీర్. లాస్ట్ అండ్ ఫైనల్ లో సుధీర్ చేతిలో అనసూయ పది రూపాయలు పెట్టి "దారి ఖర్చులకు ఉంచు" అని చెప్తుంది.ఐతే తాను బిల్డ్ చేసుకున్న కెరీర్ ని ఇలా పిచ్చి పిచ్చి స్కిట్స్, కామెడీస్ తో సుధీర్ చెడగొట్టుకుంటున్నాడని అతని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.