English | Telugu

ముద్దు కూడా ముగ్గురికి ఇవ్వాలా!?

ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే గెటప్ శీను మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కంటే కూడా ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ కే కాస్త రేటింగ్ ఎక్కువగా వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈనెల‌ 5న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి 'రైటర్ పద్మభూషణ్' మూవీ నుంచి యాక్టర్ సుహాస్, యాక్ట్రెస్ టీనా శిల్పరాజ్ గెస్టులుగా వచ్చేసారు.

కాసేపు వీళ్ళిద్దరూ తమ మూవీలోంచి కొన్ని డైలాగ్స్ చెప్పాక కెవ్వు కార్తీక్ తన స్కిట్ తో ఎంట్రీ ఇచ్చాడు. 'స్టాలిన్' మూవీలో చిరంజీవిలా కెవ్వు కార్తిక్ పెర్ఫార్మ్ చేశాడు. హీరోయిన్ గా వర్ష ఎంటర్టైన్ చేసేస్తుంది. "నీకోసం ఒకటి చెప్పాలని వచ్చాను, ఒకటి ఇవ్వాలని వచ్చాను" అని వర్ష అనేసరికి కార్తిక్ ఏమో "నో.. నో.. నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ముందు ముగ్గురికి ఇవ్వు. తర్వాత ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి ఇవ్వమని చెప్పు" అన్నాడు. వర్ష తల పట్టుకుంది.

కెవ్వు కార్తిక్ చెప్పిన డైలాగ్ కి ఇంద్రజ మధ్యలో వచ్చి "అంటే ముద్దు కూడా ముగ్గురికి ఇవ్వాలా" అంటుంది. అంతే ఊహించని పరిణామానికి షాక్ అయ్యాడు కార్తీక్. తర్వాత గెటప్ శీను, రాంప్రసాద్ పోలీస్ ఆఫీసర్ గా, కానిస్టేబుల్స్ గా వచ్చి స్కిట్ వేశారు. ఆ స్కిట్ లో అన్నపూర్ణమ్మ ఖైదీగా వచ్చింది. గెటప్ శీను వచ్చి సంతకం పెట్టమంటే "నేను పెట్టాను" అంటూ ముఖంలోకి చూడకుండా షర్ట్ కేసి చూస్తూ మాట్లాడుతుంది.

"ఏంటి అక్కడ చూసి మాట్లాడుతున్నావ్" అన్నాడు శీను. "నేను అక్కడే చూస్తాను నీ ముఖం చూస్తాను.. చెంబుచ్చుకుని వెళ్లే ముఖం నువ్వూనూ".. అని అన్న‌పూర్ణ‌మ్మ అనేసరికి శీను ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్ మాములుగా ఉండవు. "అన్నపూర్ణమ్మ కంటే పెర్ఫామెన్స్ నేను చాలా తక్కువగా చేస్తున్నట్టు అనిపిస్తోంది" అని శీను అనేసరికి అందరూ నవ్వేస్తారు. ఇలా ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ అందరినీ ఎంటర్టైన్ చేయబోతోంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.