English | Telugu

ఈ వయసులో గడ్డివామి చాటు రొమాన్స్ ఏంటి!?

ఇటీవల ఏ షో చూసినా కమెడియన్స్ వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని కూడా పనిలో పనిగా ఆడియన్స్ కి పరిచయం చేసేస్తున్నారు. బులెట్ భాస్కర్ కూడా వాళ్ళ నాన్నను అలాగే పరిచయం చేశాడు. ఇక ఇదే అదనుగా భాస్కర్ వాళ్ళ నాన్న కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు భాస్కర్ కంటే వాళ్ళ నాన్నే ఫామ్‌లో ఉన్నాడు. ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసేస్తున్నాడు. ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతర స్పెషల్ లో భాస్కర్ వాళ్ల నాన్న అక్రమ సంబంధాల విషయంలో కౌంటర్ లు వేశాడు.

శాంతి స్వరూప్ తో కలిసి గడ్డి వామి చాటు రొమాన్స్ చేయడాన్ని చూసిన భాస్కర్ "నాన్నా.. ఏమిటి ఇక్కడో అమ్మ, ఇంట్లో ఒక అమ్మ.. ఏంటి నాన్న ఇది".. అంటాడు. వెంటనే తడుముకోకుండా ఆయ‌న‌, "నువ్వు నలుగురిని మైంటైన్ చేస్తున్నావ్" అంటూ భాస్కర్ పరువు తీసేశాడు. ఐతే ప్రతీ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో భాస్కర్ వాళ్ళ నాన్నతోనే స్కిట్ వేయిస్తున్నాడు. ఇదే స్కిట్ లో ఆదికి జోడీగా వర్ష, రాంప్రసాద్ కి జోడీగా ఫైమా, నాటీ నరేష్ కి జోడీగా జోర్దార్ సుజాత చేశారు.

ఇదే స్కిట్ లో బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న గురించి తెలిసిపోయేసరికి ఆయ‌న‌ బూతులు మాట్లాడేశాడు. ఇంద్రజ షాక్ ఐపోయింది. హైపర్ ఆది వెంటనే భాస్కర్ వాళ్ళ నాన్న నోరు మూసేస్తాడు. ఇక దీన్ని మొత్తాన్ని కవర్ చేయడానికన్నట్టు రాంప్రసాద్, ఫైమా డాన్స్ చేస్తూ వస్తారు. ఏదైమైనా భాస్కర్ వాళ్ళ నాన్న అప్పుడప్పుడు స్కిట్స్ లో అదుపు తప్పి మాట్లాడ్డం చూస్తూనే ఉన్నాం.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.